ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనకు కోర్టు అంగీకారం తెలిపింది.
కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఈనెల 26 వరకు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో కుటుంబసభ్యులు, న్యాయవాదులు చిదంబరంను రోజూ 30 నిమిషాల పాటు కలిసేందుకు అనుమతిచ్చింది కోర్టు.
ఇదీ చూడండి: కోర్టులో చిదంబరం: 5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ