ETV Bharat / bharat

కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా! - Sonia

కాంగ్రెస్​ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని సోనియా గాంధీ యోచిస్తున్నట్టు సమాచారం. పార్టీ నేతలంతా కలిసి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని కాంగ్రెస్​ సభ్యులను ఆమె కోరినట్టు తెలుస్తోంది. ఈ వార్తలను కాంగ్రెస్​ ఖండించినప్పటికీ.. సోమవారం జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ వ్యవహారంపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

Sonia Gandhi
అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకే 'సోనియా' మొగ్గు!
author img

By

Published : Aug 23, 2020, 8:57 PM IST

కాంగ్రెస్​ అధ్యక్ష పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. పార్టీని సమర్థవంతంగా నడిపించే కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని నేతలను సోనియా కోరినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్​ నాయకత్వాన్ని పూర్థిస్థాయిలో మార్చాలని డిమాండ్​ చేస్తూ కొంతమంది సీనియర్​ నేతలు రాసిన లేఖపై సోనియా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే.. సోమవారం జరగబోయే కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

అనిశ్చితి..

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన క్రమంలో పార్టీకి గాంధీయేతరులే అధ్యక్షులు అవుతారని రాహుల్​ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రియాంకా గాంధీ కూడా వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారిని ఎన్నుకోవటాన్ని చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. సోనియానే పదవిలో కొనసాగాలని లేదా.. రాహుల్​ గాంధీని తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్​ చేస్తున్నారు. దీంతో సోమవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా రాజీనామాను అంగీకరించే విషయంపై అనిశ్చితి ఉండక తప్పదని రుజువు అవుతోంది.

'ఆ వార్తలు అవాస్తవం...'

అయితే.. సోనియా రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా. పార్టీ నాయకత్వం మార్పుపై సోనియా గాంధీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదన్నారు.

సోనియావైపే..

మరోవైపు సోనియా గాంధీ నాయకత్వానికే మద్దతు పలుకుతూ రాహుల్​ గాంధీకి లేఖ రాశారు ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బగేల్​. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సోనియా మార్గదర్శకత్వం అవసరమని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్​ నేతలు చేస్తున్న డిమాండ్​ను వ్యతిరేకించారు పంజాబ్ సీఎం అమరిందర్​ సింగ్​. ఇది సరైన సమయం కాదని.. ఎన్డీఏ ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్​కు ఉందన్నారు. ప్రస్తుత సమయంలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని కోరటం సరికాదని పేర్కొన్నారు మాజీ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్​.

గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. పార్టీ చీలిపోతుందని కొంత మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబీకులే పార్టీని నడిపించాలని ఎక్కవ మంది కాంగ్రెస్​ నేతలు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.