ETV Bharat / bharat

దిల్లీ ప్రశాంతం.. అయినా భద్రత కట్టుదిట్టం - delhi violence news

ఈశాన్య దిల్లీలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రోడ్లపై జనసంచారం పెరుగుతోంది. భయం పోగొట్టేందుకు వీధుల్లో కవాతు చేస్తున్నాయి భద్రతా బలగాలు. స్థానికులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

delhi
దిల్లీ
author img

By

Published : Feb 29, 2020, 1:41 PM IST

Updated : Mar 2, 2020, 11:05 PM IST

అల్లర్లు చెలరేగిన ఈశాన్య దిల్లీలో శనివారం శాంతియుత వాతావరణం నెలకొంది. ఘర్షణల కారణంగా ప్రాణభయంతో బయటికి వెళ్లిన స్థానికులు క్రమంగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. వీధుల్లో జనసంచారం పెరుగుతోంది.

స్థానికుల్లో భయాలను పోగొట్టేందుకు భద్రతా సిబ్బంది కవాతులు నిర్వహిస్తున్నారు. స్థానికులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని చెబుతున్నారు.

అసత్య ప్రచారాలు నమ్మొద్దు..

ఎవరైనా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు పోలీసులు. అంతేకాదు.. ఆ వార్తలను ఎవరికి పంపవద్దని.. అలా చేస్తే నేరంగా పరిగణిస్తామని తెలిపారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చేందుకు వాట్సాప్​ హెల్ప్​లైన్​ నంబర్​ను ఏర్పాటు చేసే ఆలోచనలో దిల్లీ ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు సమాచారం.

అల్లర్లలో మరణించినవారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు వారి బంధువులు.. గురుతేగ్​ బహదూర్​ ఆసుపత్రి ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 23న ఈశాన్య దిల్లీలో మొదలైన అల్లర్లలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా పౌరులు గాయపడ్డారు.

శాంతి ర్యాలీ..

దిల్లీలో జరిగిన హింసకు వ్యతిరేకంగా జంతర్​మంతర్​ వద్ద ఇవాళ శాంతి ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలతో వచ్చిన వేలాది మంది జైశ్రీరాం, భారత్​మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దిల్లీ శాంతి వేదిక నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో భాజపా నేత కపిల్ మిశ్రా పాల్గొన్నారు.

ఇదీ చూడండి: విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్​!

Last Updated : Mar 2, 2020, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.