జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని శ్రీనగర్‌లో పర్యటించిన ప్రతినిధుల బృందంలో ఒకరైన వియత్నాం రాయబారి ఫామ్ సాన్ చౌ పేర్కొన్నారు. ప్రజా సంఘాలు, రాజకీయ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత అక్కడ అంతా సవ్యంగానే ఉన్నట్లు అర్థమైందని తెలిపారు.
"జమ్ముకశ్మీర్ ప్రజలు సాధారణ జీవితాన్ని గడపడం నేను గమనించా. అక్కడి పరిస్థితుల విషయంలో వారిలో ఎలాంటి ఆందోళన లేదు. చాలా సంతోషంగా ఉన్నారు. మేము జమ్ముకశ్మీర్‌కు నిజనిర్ధరణ కోసం రాలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రతినిధులం కాదు. కేవలం ఇక్కడి పరిస్థితులను మాకు మేముగా అంచనా వేసుకోవడానికి వచ్చాం. అయితే స్థానికులతో మాట్లాడినప్పుడు వారు సంతోషంగా ఉన్నట్లు మాకు అర్థమైంది."
-ఫామ్ సాన్ చౌ, వియత్నాం రాయబారి
జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు భారత్‌లోని విదేశీ రాయబారుల బృందం జమ్మూతోపాటు శ్రీనగర్‌లో పర్యటించింది.