ETV Bharat / bharat

'దిల్లీ హింస ప్రభుత్వ కుట్రే.. నిరసన కొనసాగిస్తాం' - farmers protest delhi border

Security heightened at Singhu border where farmers are protesting against FarmLaws
ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం
author img

By

Published : Jan 27, 2021, 8:46 AM IST

Updated : Jan 27, 2021, 8:52 PM IST

20:47 January 27

సంయుక్త కిసాన్​ మోర్చా ప్రకటన..

  • కిసాన్ గణతంత్ర పరేడ్ ప్రభుత్వ కుట్రకు బలైంది: సంయుక్త కిసాన్ మోర్చా
  • రైతులు శాంతియుతంగానే ర్యాలీలో పాల్గొన్నారు: సంయుక్త కిసాన్‌ మోర్చా
  • పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీని ముందుంచి నడిపించారు: సంయుక్త కిసాన్‌ మోర్చా
  • మాతో సంబంధంలేని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీని ముందు పెట్టి ఉద్రిక్తతలు జరిగేలా చేశారు
  • ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను రద్దు చేసుకుంటున్నాం.
  • ఎర్రకోట మార్గం మా పరేడ్‌లో భాగం కాదు
  • కొంతమంది కుట్రపూరితంగా రైతుల కవాతును విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేశారు
  • శాంతియుతంగా మా ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది
  • కేంద్రం కొత్త సాగు చట్టాలు రద్దు చేసే వరకు వెనక్కి వెళ్లం

18:14 January 27

  • #WATCH: Some farmers seen taking off their tents at Chilla border following announcement of Thakur Bhanu Pratap Singh, president of Bharatiya Kisan Union (Bhanu), that the organisation is ending the protest in the light of violence during farmers' tractor rally y'day.#FarmLaws pic.twitter.com/wgDIeKnUMf

    — ANI UP (@ANINewsUP) January 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టెంట్లు ఎత్తేస్తున్న రైతులు..

చిల్లా సరిహద్దులో కొందరు రైతులు తమ టెంట్లను ఎత్తేస్తున్నారు. నిరసనల నుంచి తప్పుకుంటున్నట్టు భారతీయ కిసాన్​ యూనియన్​(భాను) ప్రకటించిన కొద్దిసేపటికే రైతులు ఇలా టెంట్లు తీసేస్తున్నారు.

18:03 January 27

37మంది నేతలు..

దిల్లీ హింసకు సంబంధించి ఇప్పటికే అనేక ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు పోలీసులు. వీటిల్లోని ఒక ఎఫ్​ఐఆర్​లో.. మేధా పాఠక్​, బుటా సింగ్​, యోగేంద్ర యాదవ్​తో పాటు మొత్తం మీద 37మంది రైతు నేతల పేర్లు ఉన్నాయి. నిర్ణీత సమయం, నిర్దేశిత మార్గలు వంటి నిబంధనలను వీరు ఉల్లంఘించారని ఎఫ్​ఐఆర్​లో పోలీసులు పేర్కొన్నారు.

16:56 January 27

మరో రైతు సంఘం...

దిల్లీ హింస అనంతరం.. గత కొన్ని నెలలుగా నిర్విరామంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. రైతు సంఘాలు ఒక్కొక్కటిగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి తప్పుకోగా.. తాజాగా ఆ జాబితాలో భారతీయ కిసాన్​ యూనియన్​(భాను) చేరింది. చిల్లా సరిహద్దులో ఇన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నామని.. కానీ దిల్లీలో జరిగిన హింస తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు సమితి అధ్యక్షుడు ఠాకుర్​ భాను ప్రతాప్​ సింగ్​. అందువల్ల 58రోజుల నిరసనకు ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు.

16:34 January 27

రైతు సంఘంలో చీలిక!

దిల్లీ హింస అనూహ్య పరిణామాలకు దారి తీస్తోంది. నిరసనల నుంచి తప్పుకుంటున్నట్టు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కన్వీనర్ వీఎం సింగ్​ ప్రకటించారు. నిరసనలు నడిపించే వారు వేరే విషయాలపై దృష్టిపెడుతున్నారని.. వారితో ఇక కలిసి ఇక ముందుకు నడవలేమని వెల్లడించారు.

ఈ ఆందోళన నుంచి మేము తప్పు కుంటున్నాం. వేరొకరి మార్గంలో ఈ ఆందోళనను ముందుకు కొనసాగించలేంనాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం వేరేలా ఉన్నప్పుడు మేము కొనసాగించలేము. కొందరు నేతలు నిన్న ర్యాలీని ముందుగానే ప్రారంభించడం సరికాదు. రాకేష్ టికాయట్ లాంటి నేతలు సమయాని కంటే ముందు బారికేడ్లు తోసుకుని రావడం వల్లే ఉద్రిక్తత నెలకొంది. నిర్దేశిత మార్గాల్లో కాకుండా ర్యాలీని వేరే మార్గాల్లో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఏం సాధించాం? ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం మన పూర్వీకుల త్యాగఫలం. నిన్నటి ఘటన నేపథ్యంలో ఆందోళన నుంచి తప్పుకుంటున్నాం. మద్దతు ధర కోసం ఆందోళన కొనసాగుతుంది. కానీ ఈ మార్గంలో ఆందోళన చేయాలని ఇక్కడికి రాలేదు. రైతులు దెబ్బలు తినడానికో, చనిపోవడానికో రాలేదు. రైతుల హక్కులు సాధించుకోవడానికి వచ్చాం.

--వి.ఎం.సింగ్ , అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కన్వీనర్

15:24 January 27

'రైతుల ఐక్యతను దెబ్బతీయడానికే..'

నిన్న జరిగిన ఎర్రకోట, ఐటీవో ఘటనలు బాధాకరంఎర్రకోట వద్ద జరిగిన ఘటనను ఖండిస్తున్నాంరైతుల పరేడ్ ను హింసాత్మక మార్చాలని కుట్ర పన్నారుసంయుక్త కిసాన్ మోర్చాతో సంబంధం లేని కొందరు నిబంధనలు ఉల్లంఘిచారు.రైతుల ఆందోళనలో వేరే శక్తులు కలిసి రైతుల ఐక్యతను  దెబ్బతీయాలని చూస్తున్నారు.నిన్నటి ఘటనతో ఆందోళనల్లో పాల్గొన్న వారిలో ఎవరు రైతులో, ఎవరు వేరే వ్యక్తుల్లో తేలిపోయిందిదీప్ సిద్దు వంటి వ్యక్తులు ఎర్రకోటను కావాలనే లక్ష్యంగా చేసుకున్నారు.ఎర్రకోటపై జెండాలు ఎగురవేయాలన్న ఉద్దేశ్యం మాకు లేదుచారిత్రక ఆందోళనలో నిన్న జరిగిన ఘటన ఒక మచ్చగా ఉండిపోతుంది.90 శాతం సంయుక్త కిసాన్ మోర్చా అనుకున్నట్లుగానే 3 మార్గాల్లో ర్యాలీ వెళ్లింది.కేవలం కొంతమంది చేసిన కుట్ర కారణంగా ఆందోళనలు జరిగాయితప్పకుండా వైఫల్యాలు ఉంటే సఈ చేసుకొని శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తాం

--కవిత కురుగంటి, అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ప్రతినిధి

15:21 January 27

సరిహద్దులో సమావేశం..

సింఘు సరిహద్దులో సమావేశమైన సంయుక్త కిసాన్ మోర్చా నేతలు

మంగళవారం నాటి ట్రాక్టర్ పరేడ్ హింసాత్మక ఘటనలపై చర్చ

పరేడ్ జరిగిన తీరు, నిబంధనల ఉల్లంఘన, లాఠీచార్జి సహా అన్ని పరిణామాలపై నేతల సమీక్ష

14:46 January 27

హోంశాఖ ఆదేశాలు..

  • దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై దృష్టి సారించాలని అన్ని దర్యాప్తు సంస్థలకు కేంద్ర హోం శాఖ ఆదేశించినట్లు సమాచారం.
  • మంగళవారం సాయంత్రం జరిగిన భేటీలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడి.
  • దిల్లీలో అదనపు బలగాల కేటాయింపుతో పాటు.. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాలపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు సమాచారం.

14:13 January 27

అమిత్​ షా నివాసంలో మరోసారి భేటీ..

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం
  • హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో భేటీ తర్వాత మరోసారి సమావేశం
  • సమావేశానికి హాజరైన హోంశాఖ కార్యదర్శి, దిల్లీ పోలీసు కమిషనర్
  • సమావేశానికి హాజరైన ఐబీ చీఫ్, ఇతర ఉన్నతాధికారులు
  • దిల్లీలో నిన్నటి ఘటనపై చర్చిస్తున్న కేంద్ర హోంశాఖ వర్గాలు
  • హోంమంత్రికి సవివరంగా నివేదిక అందించిన దిల్లీ పోలీసులు

13:10 January 27

మంగళవారం రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించి 200మందిని అదుపులోకి తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. వీరిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

12:24 January 27

  • కేంద్ర హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ చేరుకున్న సీఆర్పీఎఫ్ డిజి మహేశ్వరి.
  • ఎర్రకోట ఘటన నేపథ్యంలో హోం శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో హాజరుకానున్నట్లు సమాచారం.

12:20 January 27

  • కేంద్ర హోం కార్యదర్శి అధ్యక్షతన నార్త్ బ్లాక్ లో ఉన్నత స్థాయి సమావేశం.
  • సమావేశానికి హాజరైన న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఐబి అధికారులు, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు
  • హింసాకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం.
  • ఎర్రకోట వద్ద జెండాలు ఎగురవేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలను తీసుకునేందుకు హోంశాఖ పరిశీలన.
  • దాడులకు పాల్పడినవారిని సిసిటివి కెమెరాల ద్వారా గుర్తించాలని సూచన.
  • నిన్న జరిగిన హింసకు సంబంధించి అధికారికంగా 22 కేసులు నమోదు అయినట్లు హోం శాఖకు నివేదించిన ఢిల్లీ పోలీసులు.
  • పలువురు రైతు సంఘ నాయకుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు సమాచారం.
  • ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ ఘటనలపై దర్యాప్తు మొదలు పెట్టినట్లు హోం శాఖకు ఢిల్లీ పోలీసుల నివేదిక.
  • ఎర్రకోటపై హింసపై దర్యాప్తులో ఐబీ, కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసుల వెల్లడి.

12:17 January 27

మంగళవారం దేశ రాజధానిలో జరిగిన హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు.. మధ్యాహ్నం 2 గంటలకు రైతు సంఘాల నేతలు సమావేశం కానున్నారు. సింఘు సరిహద్దు వద్ద భేటీకానున్న కిసాన్ మోర్చా నేతలు... పరేడ్‌లో నిబంధనల ఉల్లంఘన, లాఠీఛార్జ్‌ అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు . హింసాత్మక ఘటనలపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్న నేతలు.. హింసకు కారణం విద్రోహక శక్తులేనని పేర్కొన్నారు. ఎర్రకోటపై జెండాలు ఎగురవేయడం తమ ఆలోచన కాదన్నారు. శాంతియుత ర్యాలీని హింసాత్మకంగా మారేలా కుట్ర పన్నారని ఆరోపించారు.

12:08 January 27

  • #WATCH: Broken shards of glass, scattered pieces of paper and vandalised ticket counter seen at the Red Fort in Delhi.

    A group of protestors climbed to the ramparts of the fort and unfurled flags on January 26. pic.twitter.com/myCOU9QrJK

    — ANI (@ANI) January 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్రాక్టర్​ ర్యాలీ రోజు దిల్లీలోని ఎర్రకోట వద్ద ఆందోళనకారులు ఎంతటి విధ్వంసం సృష్టించారో అక్కడి దృశ్యాలు కళ్లకుకడుతున్నాయి. ఎర్రకోటలోని టికెట్​ కౌంటర్​పై దాడి చేసిన నిరసనకారులు ఫర్నిచర్​ను ధ్వంసం చేశారు.

11:52 January 27

ట్రాక్టర్​ పరేడ్ సందర్భంగా మంగళవారం హింసాత్మక ఘటనలు జరిగిన ఎర్రకోట ప్రదేశాన్ని కేంద్ర పర్యటక మంత్రి ప్రహ్లాద్​ పటేల్ సందర్శించారు.

11:51 January 27

ఎర్రకోట వద్ద ఆందోళనకారుల విధ్వంసానికి సంబంధించిన మరిన్ని దృశ్యాలు.

11:46 January 27

గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. బుధవారం ఉదయం అక్కడి దృశ్యాలు.

11:45 January 27

నిన్న ట్రాక్టర్​ ర్యాలీలో జరిగిన హింసాత్మక ఘటనలపై దిల్లీ పోలీస్​ కమిషనర్​ సీనియర్​ అధికారులతో సమావేశమయ్యారు. 

11:36 January 27

  • Some miscreants joined the protest to defame farmers' movement. We did not plan to unfurl the flags at Red Fort, this was not our program. Deep Sidhu's photo with the PM has floated, we had already expressed doubt over him: SS Pandher, Kisan Mazdoor Sangharsh Committee pic.twitter.com/8M4Bo9YZtv

రైతులను అపఖ్యాతిపాలు చేసేందుకు కొందరు దుండగులు ఆందోళనల్లో పాల్గొన్నారని కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ నేత ఎస్ఎస్ పండేర్​ తెలిపారు. ట్రాక్టర్​ పరేడ్​ ర్యాలీలో ఎర్రకోటపై జెండా ఎగురవేయాలనే ప్రణాళికలేమీ తమకు లేవని చెప్పారు. ఈ ఘటనలో పాల్గొన్న దీప్​ సిద్ధు.. గతంలో ప్రధాని మోదీతో పొటోలు దిగారని పేర్కొన్నారు. అతనిపై మొదటి నుంచి తమకు అనుమానం ఉందన్నారు.

11:21 January 27

  • ఎర్రకోట ఘటనపై ఎన్ఐఏ విచారణ చేపట్టినట్లు సమాచారం
  • ఎర్రకోట ఘటనకు ప్రధాన బాధ్యులుగా ఇద్దరిపై ఆరోపణలు
  • పంజాబ్‌ గాయకుడు దీప్ సిద్ధుపై ప్రధాన ఆరోపణలు
  • దీప్‌ సిద్ధుకు నిన్న సాయంత్రం నోటీసు పంపినట్లు సమాచారం
  • 'దీప్ దీపు' అనే మరో వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం
  • ఆందోళనకారులు ఎర్రకోట వైపు వెళ్లేలా ప్రోత్సహించారని ఆరోపణలు
  • పంజాబీ యువకులను రెచ్చగొట్టినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు
  • సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఎన్‌ఐఏ
  • ఎర్రకోట భద్రత, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం
  • విచారణకు హాజరు కావాలని ఇద్దరికీ గతంలోనే నోటీసులు పంపిన ఎన్ఐఏ
  • డిసెంబర్‌లో, ఈ నెల 16న నోటీసులు పంపినా.. విచారణకు హాజరుకాని దీప్ సిద్ధు
  • దీప్‌ సిద్ధుపై ఐపీసీ 120బి, 124ఎ, 153ఎ, 153బి సెక్షన్ల కింద కేసు నమోదు
  • దీప్ సిద్ధుతో పాటు మరికొందరిపైనా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
  • రైతుల ఆందోళనల్లో చాలామంది అనుమానితులు ఉన్నట్లు సమాచారం
  • తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచిన ఎన్‌ఐఏ

11:19 January 27

  • నిన్నటి ఎర్రకోట ఘటనపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు
  • సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన న్యాయవాది విశాల్ తివారి
  • ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక ఘటనపై న్యాయ విచారణ జరపాలని పిల్
  • ముగ్గురు సభ్యులతో దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేయాలన్న పిటిషనర్
  • ఎర్రకోటపై వేరే జెండా, బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వినతి

10:39 January 27

రిపబ్లిక్​ డే రోజు రైతుల ట్రాక్టర్​ పరేడ్​లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 300మందికిపైగా పోలీసులు గాయపడినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

10:28 January 27

టిక్రీ సరిహద్దులో బందోబస్తు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న టిక్రీ సరిహద్దులో భద్రతను పటిష్ఠం చేశారు అధికారులు. నిన్నటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించారు.

10:02 January 27

  • We said bring your own sticks. Please show me a flag without a stick, I will accept my mistake: Rakesh Tikait on viral video where he was seen appealing to his supporters to be armed with lathis https://t.co/LKw8ihVmtE

దీప్​ సిద్దు అనే వ్యక్తి సిక్కు మతానికి చెందిన వాడు కాదని, భాజపా కార్యకర్త అని రాకేశ్ టికైత్ తెలిపారు. ప్రధాని మోదీతో అతను ఫొటో కూడా దిగాడని చెప్పారు. ఇది రైతుల ఉద్యమం అని, అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు తక్షణమే దిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ట్రాక్టర్​ ర్యాలీలో హింసాత్మక ఘటనలకు పాల్పడి, పోలీసుల బారీకేడ్లు ధ్వసం చేసిన వారు ఇకపై ఉధ్యమంలో భాగం కాలేరని రాకేశ్​ టికైత్​ తేల్చి చెప్పారు.

తన మద్దతుదారులు లాఠీలతో ఉండాలని తికైట్​ చెప్పిన వీడియో వైరల్​ కావడంపై ఆయన స్పందించారు. జెండాలు పట్టుకునేందుకు ఎవరి కర్రలు వారు తెచ్చుకోవాలని మాత్రమే తాము సూచించామని చెప్పారు. కర్రలు లేకుండా జెండాలు పట్టుకోలేమన్నారు. ఈ విషయంలో తన తప్పును అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

09:42 January 27

  • Those who created violence and unfurled flags at Red Fort will have to pay for their deeds. For last two months, a conspiracy is going on against a particular community. This is not a movement of Sikhs, but farmers: Rakesh Tikait, Bharat Kisan Union https://t.co/aJxHcibvSl

 ట్రాక్టర్​ ర్యాలీలో హింసాత్మక ఘటనలకు పాల్పడి ఎర్రకోటపై జెండాలు ఎగురవేసిన వారు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని భారత్​ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్ టికైత్ అన్నారు. గత రెండు నెలలుగా ఒక మతానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది సిక్కుల ఉద్యమం కాదని, రైతుల ఉద్యమం అని స్పష్టం చేశారు.

మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ట్రాక్టర్లు నడిపిన వారు నిరక్షరాస్యులని టికైత్​ తెలిపారు. వారికి దిల్లీలో దారులు  తెలియవని, అధికారులే దారి చూపారని చెప్పారు. కొంత మంది తెలియకుండానే ఎర్రకోట వెళ్లారని, అధికారులు వారిని తిరిగి పంపించారని వివరించారు. దిల్లీ ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న రైతులు ఇళ్లకు తిరిగివెళ్లారని పేర్కొన్నారు.

09:40 January 27

  • దిల్లీ, సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం
  • నిన్నటి కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో పటిష్ట బందోబస్తు
  • ఎర్రకోట వద్ద భారీగా పోలీసు బలగాల మోహరింపు
  • దిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల గస్తీ
  • దిల్లీ సరిహద్దుల్లో రైతుల దీక్షా శిబిరాల వద్ద భద్రత పెంపు
  • ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్లు మూసివేత
  • జామా మసీదు మెట్రో స్టేషన్ ప్రవేశ గేటు మూసివేసిన దిల్లీ మెట్రో
  • నిన్నటి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
  • నిన్నటి ఘటనలపై చర్యలు మొదలుపెట్టిన దిల్లీ పోలీసులు
  • 153 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు అధికారుల వెల్లడి
  • ఇద్దరు ఐసీయూలో ఉన్నట్లు దిల్లీ పోలీసు అధికారుల వెల్లడి
  • నిన్నటి ఘటనపై సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం
  • ఇప్పటికే స్పెషల్ సెల్ విచారణ ప్రారంభించారన్న ఉన్నతాధికారులు
  • పంజాబ్, హరియాణా గ్యాంగ్‌స్టర్ల కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం
  • ఘాజీపూర్ మార్కెట్ నుంచి దిల్లీ వచ్చే రహదారి పూర్తిగా మూసివేత

09:25 January 27

రిపబ్లిక్​ డే రోజు రైతుల చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీలో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 22 ఎఫ్ఐఆర్​లు నమోదైనట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

09:06 January 27

భద్రతా కారణాల దృష్ట్యా దిల్లీలోని పలు చోట్ల మెట్రో స్టేషన్లను మూసివేశారు అధికారులు. లాల్‌ఖిలా, జామామసీదు ప్రాంతాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

09:05 January 27

రైతులు ఆందోళన కొనసాగిస్తున్న సింఘు సరిహద్దు వద్ద అధికారులు భారీగా బలగాలను మోహరించారు.

08:30 January 27

200మందిని అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు

గణతంత్ర దినోత్సవం రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘూ సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించింది. రైతులు జెండా ఎగురవేసిన ఎర్రకోట వద్ద కూడా  భద్రతను పటిష్ఠ చేసింది. మంగళవారం నాటి ఘటనల దృష్ట్యా పలు ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించింది.

Last Updated : Jan 27, 2021, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.