విదేశాల్లో చదవాలన్న విద్యార్థుల కలలను చెరిపేసింది కరోనా. ప్రస్తుత పరిస్థితిల్లో మిగతా దేశాల్లో అడుగుపెట్టడం కాస్త కష్టమే! ఈ నేపథ్యంలో స్వదేశంలోనే ఇంజినీరింగ్ చేయాలనుకుంనే వారికి ఓ సదావకాశం కల్పించింది కేంద్ర మానవ వనరుల శాఖ. వారు జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఆ విభాగం మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఓ ప్రకటన చేశారు.
"విదేశాల్లో విద్యను అభ్యసించాలని కలలు కన్నారు ఎంతోమంది భారతీయ విద్యార్థులు. కరోనా కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. స్వదేశంలో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల ప్రతిపాదనల మేరకు వారికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం." -రమేశ్ పొఖ్రియాల్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి
మే 19 నుంచి మే 24 వరకు జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇతర కారణాలు వల్ల దరఖాస్తు పూర్తి చేయలేకపోయిన వారికి ఇదొక అవకాశం. దేశవ్యాప్తంగా జూలై 18 నుంచి 23 వరకు పరీక్ష జరగనుంది.
ఇదీ చూడండి: లోకల్ ఫైట్: 2 పార్టీల కార్యకర్తల తీవ్ర ఘర్షణ