ETV Bharat / bharat

భాజపాలో 'సింధియా' ఒంటరి పోరు- ఎందుకు?

కరోనా సంక్షోభంలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. రాజకీయ వేడి రాజుకుంది. మధ్యప్రదేశ్​లోనూ ఉప ఎన్నికల హడావుడి​ కనిపిస్తోంది. అయితే, భాజపాలో చేరిన మధ్యప్రదేశ్​ కీలక నాయకుడు.. జ్యోతిరాదిత్య సింధియాకు మాత్రం కష్టాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని బడా కమలం నేతలు సింధియాను దూరం పెట్టడం వల్ల.. ఆయన సామర్థ్యానికి సవాల్​గా నిలుస్తున్నాయి ఈ ఎన్నికలు. ఇంతకీ మధ్యప్రదేశ్​లో ఏం జరుగుతోంది ?

Scindia isolated
భాజపాలో 'సింధియా' ఒంటరి పోరు- ఎందుకు?
author img

By

Published : Oct 12, 2020, 5:32 PM IST

Updated : Oct 12, 2020, 5:49 PM IST

మధ్యప్రదేశ్​లో ఎన్నికలంటే కొన్ని దశబ్దాలుగా సింధియాల హవా స్పష్టంగా కనిపిస్తుండేది. ముఖ్యంగా గ్వాలియర్​ రాజవంశమైన సింధియాలకు ఆ ప్రాంతంలో గట్టి పట్టుంది. వారసత్వంగా రాజకీయాలను అందిపుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియా.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. దశాబ్దాలుగా కాంగ్రెస్​తోనే అంటకాగిన వారి కుటుంబం.. జ్యోతిరాదిత్య నిర్ణయంతో తాజాగా భాజపావైపు మళ్లింది. తన వర్గంలోని ఎమ్మెల్యేలతో సహా బయటకు వచ్చేయటం వల్ల మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వ కూలిపోవటం, భాజపా అధికారం చేజిక్కించుకోవటం, సింధియా రాజ్యసభకు వెళ్లటం చకచకా జరిగిపోయాయి.

కానీ ఇప్పుడు ఎంపీలో భాజపా అధికారం వశం చేసుకోవటంలో కీలకంగా వ్యవహరించిన సింధియా ఎక్కడా కనిపించటం లేదు. భాజపా రాష్ట్ర నేతలు ఆయనను కలుపుకుపోలేకపోతున్నారు. ప్రచారంలో దూరం పెడుతున్నారు.

ఉరుముకొస్తున్న ఉప ఎన్నికలు

ప్రస్తుతం ఉప ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్​లోని 28 స్థానాల్లో నవంబర్​ 3న పోలింగ్​ జరగనుంది. నవంబర్​ 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు. అయితే, ఆ స్థానాల్లో భాజపాను తిరుగుబాటు నేతల బెడద వేదిస్తోంది. పోటీలో సింధియా అస్మదీయులే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా.. క్రీయాశీలకంగా వ్యవహరించకపోవటం గ్వాలియర్​-చంబల్​ ప్రాంతంలో ఆయన రాజకీయ ఉనికికే సవాళ్లు విసురుతోంది.

సింధియాకు సవాలే !

ప్రచారంలో భాగంగా సింధియాకు భాజపా కీలక నేతలెవరూ మద్దతు ఇవ్వటం లేదు. తన మద్దతుదారులను గెలిపించుకోవటంలో సింధియా ఒంటరి వారయ్యారు. కేవలం ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ మాత్రమే ఆయనకు తోడ్పాటునందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వర్గాన్ని గెలిపించుకోవటం సింధియాకు సవాలే.

28 శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. వీటిలో 16 స్థానాలు గ్వాలియర్​-చంబల్​ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ స్థానాలను గెలుచుకోవటం సింధియా నాయకత్వానికి పరీక్షే అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్​ను వీడి భాజపా గూటికి చేరిన సింధియా వర్గాన్ని ప్రజలు ఎంతవరకూ ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

కానరాని మద్దతు

2018 ఎన్నికల్లో భాజపా సీనియర్​ నేతలపై పోటీ చేసి కాంగ్రెస్​ తరఫున విజయం సాధించిన అభ్యర్థులు.. ఇప్పుడు కాషాయం కండువాతో బరిలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో భాజపా నేతలు, కార్యకర్తల నుంచి వారికి మద్దతు కరవైంది. కొన్నిచోట్ల తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో నిలబడుతున్నారు భాజపా నాయకులు. తేరుకున్న పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది.

భాజపా ప్రతి ఎన్నిక తమకు కీలకమంటోంది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా సింధియాతో కలిసి పనిచేయాలని పార్టీ నేతలను బుజ్జగిస్తోంది. మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా తన అభ్యర్థులను భాజపా టికెట్​పై గెలిపించి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అందరినీ కులుపుకుని వెళ్లాల్సిన సింధియా.. ఒంటరైపోయారు. మరోవైపు కాంగ్రెస్​ సైతం సింధియాల మద్దతు లేకపోయినా.. ఈ స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. తమ క్యాడర్​ సింధియావైపు మొగ్గుచూపకుండా చూసుకుంటోంది. విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

భాజపాలో అసమ్మతి

శివరాజ్​ సింగ్​ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న సింధియా వర్గం నేతలకు చంబల్ ప్రాంతంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇన్నాళ్లు కలిసి ఉన్నవారిపైనే... ఇప్పుడు పోరాటం చేయాల్సి రావటం ఇందుకు కారణమంటున్నారు. మంత్రిగా కొనసాగాలంటే వారికి విజయం సాధించటం అనివార్యం. ఈ పరిస్థితుల్లో భాజపా తిరుగుబాటు నేతలను బుజ్జగించి.. తిరిగి కాంగ్రెస్​ అభ్యర్థులను ఓడించటం కష్టమేనని విశ్లేషిస్తున్నారు.

మధ్యప్రదేశ్​లో కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని కూల్చి భాజపా అధికారం చేపట్టినా... ఇప్పుడు అధికారంలోనే ఉన్నా.. ఉప ఎన్నికలు అంత సులభంగా ఉండబోవన్న వాదనలు వినిపిస్తున్నాయి. భాజపా నుంచి ఈ నియోజకవర్గాల్లో ఏళ్లుగా పోటీ చేస్తున్న నేతల నుంచి తీవ్ర అసమ్మతి కనిపిస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన కాంగ్రెస్​ నేతలకు వీరు మద్దతు తెలపాల్సి రావటం జీర్ణించుకోలేకపోతున్నారు. 2018 ఎన్నికల్లో వీరి చేతుల్లోనే ఓటమి పాలవటం.. భాజపా నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భాజపా అగ్రనేతలు.. కొత్త అభ్యర్థుల ఓటమికి పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు పరిశీలకులు.

సింధియా నిరూపించుకునేనా ?

భాజపాలో చేరిన తర్వాత ఒంటరైపోయిన జ్యోతిరాదిత్య సింధియా తన అభ్యర్థుల గెలుపు వ్యూహాలు రచించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. భాజపాలోకి 22మంది ఎమ్మెల్యేలతో వచ్చిన సింధియాకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదనే వాదనలు ఉన్నాయి. అందుకే ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుని తన బలం నిరూపించుకోవాలని చూస్తున్నారు సింధియా.

కాంగ్రెస్​ కష్టాలు

కాంగ్రెస్​లోనూ పరిస్థితులు అంత ఆశాజకంగా కనిపించటంలేదు. ముఖ్యంగా అగ్రనేతలు కమల్​నాథ్​-దిగ్విజయ్​ సింగ్​ మధ్య దూరం పెరుగుతుందన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో.. ముఖ్యంగా కాంగ్రెస్​ పార్టీలో దిగ్విజయ్​ కీలకంగా ఉంటారు. సింధియా కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని కూల్చి.. భాజపాతో జట్టు కట్టిన తర్వాత పార్టీలో దిగ్విజయ్​ ప్రాధాన్యం మరింత పెరిగింది.

Chambal at stake
దిగ్విజయ్​ సింగ్​

దిగ్విజయ్ ఎక్కడ ?

అయితే, ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు దిగ్విజయ్​ ఎక్కడా కనిపించలేదు. ప్రచారం పూర్తిగా కమల్​నాథ్​ నేతృత్వంలోనే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో దిగ్విజయ్​ పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పట్టున్న ప్రాంతాల్లోనూ కాంగ్రెస్​ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనటం లేదు.

గతంలో రాష్ట్రాన్ని దిగ్విజయ్​ సింగ్​ పదేళ్లపాటు పాలించారు. 1993లో ముఖ్యమంత్రి అయిన ఆయన.. 2003 వరకు కొనసాగారు. అనంతరం ఎంపీగా, కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు. అయితే, క్రమంగా పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అయినా, 2018లో కాంగ్రెస్​ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. అయితే, టికెట్ల కేటాయింపుతో అలకబూనిన దిగ్విజయ్​.. కమల్​నాథ్​ ప్రభుత్వానికి పూర్తి సహాయసహకారాలు అందించలేదు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కమల్​నాథ్​ 15నెలల పాలనే.. ప్రధాన అజెండాగా కాంగ్రెస్​ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్​ సింగ్​ను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Last Updated : Oct 12, 2020, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.