కేసుల విచారణకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ ప్రకటించింది సుప్రీం కోర్టు. నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగాల్సిన 15 కేసుల విచారణనూ వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది సేపటికే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ఆదేశాల పత్రాన్ని పొందుపరిచింది.
అత్యవసరమైన కేసుల విచారణకు మాత్రమే ధర్మాసనం ఏర్పాటు చేస్తామని.. గత సోమవారం(మార్చి 23) వెల్లడించింది సుప్రీం కోర్టు. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ బోసేలతో కూడిన రెండు ధర్మాసనాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడతాయని స్పష్టం చేసింది. అందులో భాగంగా నేడు 15 కేసులు విచారించాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణలు రద్దు చేసింది.
ఇదీ చూడండి: కో.రో.నా: కోయీ- రోడ్ పర్- నా నిక్లే
!