ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా వద్దా అనే అంశంపై తీర్పు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 20 కోట్ల మంది అభివృద్ధికి దోహదపడతాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి వివరించారు.
విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 35 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చూడండి: హైకోర్టు జడ్జిపై సీబీఐ విచారణ.. దేశంలోనే తొలిసారి!