ETV Bharat / bharat

'సామాజిక మాధ్యమాలను క్రమబద్ధీకరించాలి' - Chief Justice S A Bobde

సామాజిక మాధ్యమాలను క్రమబద్దీకరించేందుకు చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి తాఖీదు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.

author img

By

Published : Feb 2, 2021, 6:31 AM IST

సామాజిక మాధ్యమ వేదికలను క్రమబద్ధీకరించేందుకు చట్టం తీసుకురావాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌పై సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాఖీదు జారీ చేసింది. పిటిషన్‌దారు చేసిన సూచనపై స్పందన తెలపాలని ఆదేశించింది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో బూటకపు వార్తలు, విద్వేష ప్రసంగాల వ్యాప్తికి కారణమయ్యే వారిపై విచారణ నిర్వహించేందుకు చట్టం తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. బూటకపు వార్తలు, విద్వేష ప్రసంగాలను స్వల్ప సమయంలోనే గుర్తించి ఆటోమేటిక్‌గా తొలగించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని కూడా అందులో కోరారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి తాఖీదు జారీ చేసింది. మీడియా, ఛానెళ్లు, నెట్‌వర్క్‌లపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు మీడియా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే దాఖలైన పిటిషన్‌తో కలిపి దానిపై విచారణ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: మంచు తుపాను బీభత్సం- వణుకుతోన్న అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.