ETV Bharat / bharat

ప్రైవేట్‌ వైద్య విద్యాసంస్థలకూ నీట్‌ - ప్రైవేటు విద్యా సంస్థలకూ నీట్​ తప్పనిసరి

ప్రైవేటు మైనారిటీ వైద్య విద్యా సంస్థలకూ నీట్ వర్తిస్తుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వైద్య విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులను దోపిడి చేసే పరిస్థితులను నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది మైనారిటీ విద్యా సంస్థల హక్కుల ఉల్లంఘన కాదు అని స్పష్టం చేసింది.

supreme on neet
నీట్​పై సుప్రీం కీలక తీర్పు
author img

By

Published : Apr 30, 2020, 7:54 AM IST

వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష-నీట్‌ మైనారిటీ, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది ఆ సంస్థ హక్కులను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. వైద్య విద్య ప్రవేశాల్లో జరిగే అనేక రుగ్మతులను 'నీట్‌' కట్టడి చేస్తుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 'నీట్‌'కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల(వెల్లూరు) మణిపాల్‌ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం వైద్య కళాశాల, కర్ణాటక మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజీల అసోసియేషన్‌ సహా వివిధ ప్రైవేటు మెడికల్‌ కళాశాలల తరఫున దాఖలైన 76 పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. వైద్య విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులను దోపిడి చేసే పరిస్థితులను నియంత్రించేందుకు, భారీ క్యాపిటేషన్‌ ఫీజులతో తక్కువ ప్రతిభగల విద్యార్థులకు ప్రవేశం కల్పించడాన్ని ఇది అరికడుతుందని జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

వారి హక్కుల ఉల్లంఘన కాదు..

"వ్యవస్థలో ఉన్న లోపాలను ఏరివేయడానికి వేసిన తొలి అడుగు నీట్‌. పాత విధానం వైపు మళ్లాలని నిర్ణయిస్తే భవిష్యత్తు తరాలు మమల్ని క్షమించవు" -సుప్రీం ధర్మాసనం

'నీట్‌' ద్వారా గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలన్న నిర్ణయం వల్ల అన్‌ఎయిడెడ్‌, ఎయిడెడ్‌, ప్రైవేటు, మైనారిటీ విద్యాసంస్థల హక్కులకు భంగం వాటిల్లినట్లు భావించాల్సిన అవసరం లేదని రాజ్యాంగంలోని వివిధ అధికరణాలను ప్రస్తావిస్తూ స్పష్టం చేసింది. దాతృత్వ కార్యక్రమంగా ఉండాల్సిన విద్య కూడా అమ్మకం సరుకుగానూ, ధనికులకు ప్రత్యేక హక్కుగా మారిందని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి:'దేశంలో 24.56 శాతంగా వైరస్ రికవరీ రేటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.