దేశంలో కరోనా వ్యాధి నయమయ్యే రేటు మెరుగుపడిందని తెలిపారు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. ఏప్రిల్ 19న 15 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 24.56 శాతానికి చేరుకుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ రికవరీ రేటును మరింత పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు అమితాబ్.
"7,700 మందికి పైగా కోలుకోవడం వల్ల దేశంలో కరోనా రికవరీ రేటు మెరుగుపడిందని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఏప్రిల్ 19న 15శాతంగా ఉన్న రికవరీ రేటు.. 26 నాటికి 19.2శాతంగా, ఈరోజు 24.56 శాతానికి చేరుకుంది. కేసులు ఎక్కువ నమోదవుతున్న రాష్ట్రాలు, జిల్లాలపై దృష్టిసారించి రికవరీ రేటును మరింత పెంచాలి."
-- అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సీఈఓ
దేశంలో ఇప్పటివరకు 31వేల 787మంది వైరస్ బారినపడ్డారు. రికార్డు స్థాయిలో 71మరణాలు నమోదవడం వల్ల మరణాల సంఖ్య 1,008కు చేరింది. 22వేల 982 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చూడండి:- 'లాక్డౌన్ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ!'