ETV Bharat / bharat

'లాక్​డౌన్ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ!' - కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ

లాక్​డౌన్​ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతోన్న రంగాలను ఆదుకునేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే ఆలోచన అంశాలన్నీ పరిశీలిస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Sell unsold units at 'no-profit-no-loss' to save interest, boost liquidity: Gadkari to realty cos
ఆ రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేస్తున్న కేంద్రం
author img

By

Published : Apr 29, 2020, 10:10 PM IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. స్థిరాస్తి రంగ సమాఖ్య నారెడ్కో ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్యాకేజీపై నిర్ణయం.. ప్రధాని స్థాయిలో తీసుకుంటారని స్పష్టం చేశారు.

" ప్యాకేజీ ఇవ్వడం ద్వారా అన్నిరంగాలకు వీలైనంత సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్యాకేజీకి సంబంధించి మేము సూచనలు మాత్రమే ఇవ్వగలం. తుది నిర్ణయం మాత్రం ప్రధానిదే. వ్యవవసాయం, ఎంఎస్​ఎంఈ రంగాలకు ప్రత్యేక సాయం చేసే యోచనలో కేంద్రం ఉంది. అగ్రో ఎంఎస్​ఎంఈ, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో అనేక అవకాశాలున్నాయి."

- నితిన్​ గడ్కరీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి

మరోవైపు దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవేకు ఆనుకుని ఆకర్షణీయ నగరాలను నిర్మించే యోచనలో ఉన్నట్లు కూడా గడ్కరీ వెల్లడించారు. ఈ విషయంలో తుది నిర్ణయం ఆర్థికశాఖ, ప్రధానమంత్రి కార్యాలయం తీసుకుంటాయని తెలిపారు.

హౌసింగ్​ యూనిట్లు అమ్ముకోవచ్చు

హౌసింగ్​ యూనిట్లు అమ్ముడుపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు తమ యూనిట్లు అమ్ముకోవచ్చని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వారి ద్రవ్య స్థితిని, రుణాలపై వడ్డీ వ్యయాన్ని ఆదా చేసుకోవడాానికి ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.