ETV Bharat / bharat

ఎన్​ఐఏ చట్ట సవరణపై ​విచారణకు సుప్రీం అంగీకారం - latest national news

2019 జాతీయ దర్యాప్తు సంస్థ చట్ట సవరణలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. నాలుగు వారాల్లో ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని.. సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

SC agrees to hear plea challenging National Investigation Agency (Amendment) Act, 2019
ఎన్​ఐఏ చట్ట సవరణపై ​విచారణకు సుప్రీం అంగీకారం
author img

By

Published : Jan 21, 2020, 5:54 AM IST

Updated : Feb 17, 2020, 8:00 PM IST

2019 జాతీయ దర్యాప్తు సంస్థ చట్టంలో చేసిన సవరణలను సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారిమన్​, జస్టిస్​ ఎస్​ రవింద్ర భట్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
పిటిషన్​ దాఖలు చేసిన 'సాలిడారిటీ యూత్​ మూమెంట్'​ సంస్థ.. జాతీయ భద్రతకు సంబంధించిన నేరాలపై విచారణ జరిపేందుకు రూపొందించిన ఈ చట్టానికి కొత్తగా సవరణ చేయడం వల్ల బలహీనమైందని పేర్కొంది .

జాతీయ భద్రత, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, విదేశాలతో సత్సంబంధాలు, అంతర్జాతీయ ఒప్పందాలు తదితర వాటికి సంబంధించిన కేసులన్నింటినీ దర్యాప్తు చేసేందుకు ఎన్​ఐఏను రూపొందించినట్లు పిటిషన్​లో వివరించారు. కాగా.. వ్యభిచారం కోసం మైనర్లను అక్రమ రవాణా చేయడం, వెట్టిచాకిరి, నకిలీ నోట్ల పంపిణీ వంటి ఉగ్రవాదానికి సంబంధం లేని నేరాలను చట్ట సవరణలో పొందుపరిచారు. తద్వారా రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారాలను కేంద్రం గుప్పెట్లోకి తీసుకుందని పిటిషన్​లో పేర్కొన్నారు.

చట్టాన్ని సవాలు చేసిన తొలి రాష్ట్రం

ఈ చట్ట సవరణను సవాల్​ చేస్తూ కాంగ్రెస్​ నేతృత్వంలోని ఛత్తీస్​గఢ్ ప్రభుత్వం జనవరి 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్​ఐఏ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా ఉందని ఆరోపించింది. రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని ఈ సవరణ ప్రభావితం చేస్తుందని, కేంద్రానికి హద్దులేని అధికారాన్ని అందిస్తుందని పేర్కొంది. ఆర్టికల్​ 131 కింద దావా వేసి ఈ చట్టాన్ని సవాలు చేసిన మొదటి రాష్టంగా ఛత్తీస్​గఢ్​ నిలిచింది.

ఎందుకీ చట్టం

2008 ముంబయి దాడి తర్వాత కాంగ్రెస్​ సీనియర్​ నేత పి. చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్​ సింగ్​ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాద దాడులపై రాష్ట్రాల అనుమతి లేకుండా దర్యాప్తు చేసేందుకు ఈ చట్టాన్ని రూపొందించింది.

ఇదీ చదవండి:వందేళ్లుగా ఆ గ్రామ ప్రజలు సంక్రాంతికి దూరం!

Intro:Body:

Rahul raps Modi over wealth holding of India's richest 1%

 (19:44) 

New Jan 20 (IANS) Former Congress President Rahul Gandhi took a swipe at Prime Minister Narendra Modi over the reports that India's richest 1 per cent owned more than 4 times the wealth of 953 million people, who make up for the bottom 70 per cent of the population.

The total wealth of all Indian billionaires is more than the full-year budget.

"Modi extracts wealth from poor & gives it to his crony capitalist friends & the big power brokers he's dependent on. 1% of India's super rich, now own 4 times more wealth than 1 Billion of India's poor," Rahul Gandhi tweeted.

The Congress leaders have been attacking the Prime Minister for his proximity to the industrialists.

Congress chief spokesperson Randeep Singh Surjewala alleged last week that the government was favouring Adani JV with HSL in awarding the Rs 45,000 crore contract for building six diesel-powered submarines, despite the company having no experience in submarine building.

"The government is flouting norms and the defence procurement procedure 2016 in awarding contract to the Adani HSL JV for building submarines, and promoting crony capitalism," he said.

Conclusion:
Last Updated : Feb 17, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.