పద్మ అవార్డుల మాదిరిగా ఇకపై సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డులను ప్రదానం చేయనుంది కేంద్రం. దేశ ఐక్యత, సమగ్రత, చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. భారత తొలి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్‌పటేల్ దేశ ఐక్యతకు చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా ఆయన పేరిట అవార్డు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది డిసెంబర్ 23న ప్రకటించారు. ఈ మేరకు విధి విధానాలను కేంద్ర హోంశాఖ తెలిపింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేసే ఈ అవార్డు రూపురేఖలను వెల్లడించింది హెంశాఖ . శుద్ధమైన బంగారం, వెండి మిశ్రమంతో దీన్ని రూపొందిస్తారు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ అవార్డును మరణానంతరం ప్రకటిస్తారు. హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక కమిటీ ఈ అవార్డుకు అర్హులైన వారి పేర్లను ఎంపిక చేస్తుంది.
ఇదీ చూడండి:'ప్రతిపక్ష నేతలకు అయితే జైలు లేదా బెయిల్'