భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చును విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధర్.. మోదీ అధికారిక పర్యటనలకు వెచ్చించిన సొమ్ము వివరాలను తెలియజేశారు. ఐదేళ్లలో రూ. 446.52 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు.
ఖర్చులు ఇలా...
- 2015-16లో రూ.121.85 కోట్లు
- 2016-17లో రూ.78.52 కోట్లు
- 2017-18లో రూ.99.90 కోట్లు
- 2017-18లో రూ.99.90 కోట్లు
- 2018-19లో రూ.100.02 కోట్లు
- 2019-20(ఇప్పటివరకు) రూ.46.23 కోట్లు
ఇదీ చదవండి: ఎయిర్ ఇండియాలో ఎన్ఆర్ఐలకు 100శాతం పెట్టుబడులు