కర్ణాటకలో ఓ నగల దుకాణం చోరీకి గురైంది. అయితే దుకాణం షట్టర్లను బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన దుండగులు.. బంగారానికి బదులు 50 కేజీల వెండిని దొంగలించారు.
బెంగళూరు ఇమ్మదిహల్లిలోని మాతాజీ జ్యువెలరీ దుకాణంలో ఈ నెల 5న ఈ ఘటన జరిగింది. లోపలికి ప్రవేశించిన అనంతరం దొంగలు ఓ గోల్డ్ లాకర్‌ను బద్దలుకొట్టారు. అనంతరం అందులో నుంచి 35లక్షలు విలువచేసే 50కేజీల వెండితో పాటు 10వేల నగదును పట్టుకెళ్లారు.
దొంగల కదలికలతో పాటు ఈ పూర్తి వ్యవహారం దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దుకాణం యజమాని ధర్మరాజ్.. వైట్ ఫీల్డ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి:- ఆభరణాలు ఉన్న బ్యాంక్ లాకర్‌కు బీమా అవసరమా?