విదేశాంగ శాఖ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాజ్యసభ సంతాపం ప్రకటించింది. సభలో సంతాప సందేశాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. అనంతరం సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ తనకు చెల్లెలితో సమానమని పేర్కొన్నారు ఛైర్మన్ వెంకయ్య. తనను ఎప్పుడూ 'అన్నా' అంటూ ఆప్యాయంగా పిలిచే వారని గుర్తు చేసుకున్నారు.
" శ్రీమతి సుష్మా స్వరాజ్ దయ, కరుణ, ఆప్యాయత కలిగిన నేత. ఆమె అకాలమరణం తీరని లోటు. దేశం సమర్థువంతమైన పరిపాలకులు, గొప్ప పార్లమెంటు సభ్యురాలు, ప్రజల గొంతుకను కోల్పోయింది."
-సంతాప సందేశం
ఇదీ చూడండి: సుష్మ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం