ETV Bharat / bharat

జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి: రాజ్​నాథ్​ - భారత్​లో కరోనా

దేశమంతటా ఆదివారం నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని కోరారు రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Rajnath appeals to people to make 'Janata curfew' huge success
జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి: రాజ్​నాథ్​
author img

By

Published : Mar 21, 2020, 11:29 PM IST

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్నారు. వైరస్​తో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు రాజ్​నాథ్​ పేర్కొన్నారు.

కర్ఫ్యూ సమయంలో అధికారులకు సాయం చేయడానికి సాయుధ దళాలు అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. కోవిడ్​-19 బాధిత దేశాలైన చైనా, ఇరాన్, ఇటలీ, జపాన్​ల నుంచి భారతీయులను తరలించడంలో నిర్బంధ శిబిరాల వద్ద సాయం అందించడంలో సాయుధ బలగాల కృషిని రాజ్​నాథ్​​ ప్రశంసించారు.

ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు ఐదుగురు విదేశీయులతో సహా 1,059 మందిని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్ర, రాజస్థాన్​లో క్వారంటైన్​లో ఉంచారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.