ETV Bharat / bharat

ఆటోవాలాగా రజనీ!- 'అరుణాచలం' రిపీట్‌? - రజనీకాంత్ వార్తలు

తన అభిమానులకు కొత్త సంవత్సరంలో తీపి కబురు చెబుతానని ప్రకటించారు సూపర్​ స్టార్​ రజనీకాంత్​. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన కొత్త పార్టీల జాబితాలో 'మక్కల్‌ సేవై కట్చి' వద్ద రజనీకాంత్‌పేరు ఉండటం వల్ల ఒక్కసారిగా సంచలనమైంది. అంతేకాదు, 'ఆటో'ను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై ఏయే సినిమాల ప్రభావం ఉందో ఓ లుక్కేద్దాం.

Rajinikanth has named his new political party as Makkal Sevai Katchi with autorickshaw
ఆటోవాలాగా రజనీ!- 'అరుణాచలం' రిపీట్‌?
author img

By

Published : Dec 16, 2020, 9:10 AM IST

'అన్నా మీరు తప్పకుండా రాజకీయాల్లో రావాలి' ఒకానొక దశలో రజనీకాంత్‌ నటించిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పాత్రతో దర్శకులు ఈ డైలాగ్‌ చెప్పించేవారు. దానికి రజనీ సమాధానంగా పైకి చేయి ఎత్తి చూపడమో.. లేదా వెండితెర ముందున్న ప్రేక్షకులను చూపిస్తూ.. 'వాళ్లు కోరుకుంటే వస్తా'నంటూ చెప్పడమే జరిగేది. ఇంతకాలానికి ఆ సమయం రానే వచ్చింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించిన తలైవా గత కొన్ని రోజులుగా చకచకా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తన అభిమానులకు కొత్త సంవత్సరంలో తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన కొత్త పార్టీల జాబితాలో 'మక్కల్‌ సేవై కట్చి' వద్ద రజనీకాంత్‌పేరు ఉండటంతో ఒక్కసారిగా సంచలనమైంది. అంతేకాదు, 'ఆటో'ను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై ఏయే సినిమాల ప్రభావం ఉందో ఓ సారి చూద్దాం.

'బాషా'తో మారిన రజనీ

90వ దశకం మధ్య నుంచి రజనీ నటించిన సినిమాల్లో మనకు పెను మార్పులు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాత్రలు సంభాషణలు ప్రత్యేకంగా ఉంటాయి. ఓ మాస్‌ నాయకుడి పాత్రలను ఆయన ఎంచుకున్నారు. మరీ ముఖ్యంగా 'బాషా'తో రజనీ స్టార్‌డమ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. తమిళంతో పాటు, తెలుగులోనూ రజనీకి అభిమానులు పెరిగారు. ఆ సినిమా రజనీ ఇమేజ్‌ శిఖరస్థాయికి తీసుకెళ్లింది. మాణిక్యం/మాణిక్‌ బాషాగా వైవిధ్యమైన పాత్రల్లో రజనీ మెప్పించారు. ఈ సినిమాలో ఆయన 'నాన్‌ ఆటోకారన్‌..' అంటూ తమిళ తెరపై, 'నేను ఆటో వాడ్ని' అంటూ తెలుగులో ఆడి పాడి అలరించిన తీరు మాస్‌లో మరింత చొచ్చుకుపోయింది. 'నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే' అన్న డైలాగ్‌ విపరీతంగా పాపులర్‌ అయింది.

ఆ తర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'ముత్తు' చిత్రం ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసింది. అందులో ఇచ్చిన మాట కోసం ఆస్తిని రాసిచ్చే జమీందారు పాత్రతో పాటు, ముత్తుగా ఆయన మాస్‌కు మరింత దగ్గరయ్యారు. రజనీలో రాజకీయనాయకుడి కోణాన్ని చూపించిన చిత్రం ‘అరుణాచలం'. తండ్రి ఆస్తి దుర్మార్గుల చేతిలో పడకుండా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టిన తీరు భలేగా అనిపిస్తుంది. అందులో రాజకీయ పార్టీని స్థాపించి 'రుద్రాక్ష' గుర్తుతో ఎన్నికల బరిలో తన స్నేహితుడిని నిలబెడతారు రజనీ. 'సింగన్న బయలుదేరెను' అంటూ పాటలో ఇప్పటికీ అలరిస్తుంది. ఈ సినిమాతో రజనీకి క్రేజ్‌ మరింత పెరిగింది. దీని తర్వాత వచ్చిన 'నరసింహ' రజనీని మరో మెట్టుపై నిలబెట్టింది. దీంతో ఆ సమయంలో రజనీ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

'బాబా' హిట్‌ అయి ఉంటే..?

అప్పటి వరకూ రజనీ నటించిన చిత్రాలన్నీ ఒకెత్తయితే, 2002లో ఆయన నటించిన 'బాబా' మరొకెత్తు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న అవినీతిని ప్రశ్నిస్తూ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. క్లైమాక్స్‌లో బాబాజీ దగ్గరకు వెళ్లకుండా జనం కోసం రజనీ తిరిగి వచ్చినట్లు చూపించారు. ఈ చిత్రం తర్వాత రజనీ రాజకీయ ప్రవేశం ఉంటుందని, అందుకు అనుగుణంగా 'బాబా'ను తెరకెక్కించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, రజనీ ఇచ్చిన సందేశం జనాలకు ఎక్కలేదు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణం అటుంచితే చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు ఆర్థికంగా బాగా నష్టపోయారు. అదే సమయంలో రజనీ ఓ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. తన సొంత డబ్బులతో నష్టపోయిన పంపిణీదారులను ఆదుకున్నారు.

మళ్లీ రాజకీయాల ఊసులేదు

ఆ తర్వాత రజనీ నటించిన సినిమాల్లో రాజకీయం గురించి పెద్దగా సంభాషణలు లేవు. 'శివాజీ'లో అవినీతిని ప్రశ్నించినా అది శంకర్‌ మార్కు చిత్రంగా మిగిలిపోయింది. 'కాలా'తో మళ్లీ పొలిటికల్‌ టచ్‌ ఇచ్చారు రజనీ. ఆ తర్వాత వచ్చిన '2.ఓ', 'పేట', 'దర్బార్‌' మాస్‌ కమర్షియల్‌ చిత్రాలుగా మిగిలిపోయాయి తప్ప.. ఎక్కడా రజనీ రాజకీయ ప్రవేశం పైనా పంచ్‌డైలాగ్‌లు లేకుండా చూసుకున్నారు.

మూడు నెలలే సమయం.. అరుణాచలం రిపీట్‌ అవుతుందా?

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. కాస్త అటూ ఇటూగా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కొత్త పార్టీ గుర్తులను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో రజనీ రాజకీయ పార్టీ ప్రకటన. అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ వ్యూహం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 'అరుణాచలం'లో చూపించినట్లు నెల రోజుల్లో పార్టీని స్థాపించడం, గెలుపు గుర్రాలను వెతికి పట్టుకోవడం, తన అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం, వారిని గెలిపించుకోవడం రజనీకి ఒక సవాలే. మరి 'సింగన్న' ఎప్పుడు బయలుదేరతాడో.. ఎలా ముగిస్తాడో.. కాలమే సమాధానం చెబుతుంది.

ఇదీ చూడండి: రజనీతో పొత్తుకు 'ఫోన్​కాల్​' దూరంలో కమల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.