రాజస్థాన్లో దారుణం జరిగింది. ఓ భూ తగాదాలో కొంతమంది దుండగులు నిప్పంటించగా గాయాలపాలైన ఓ పూజారి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. గురువారం రాత్రి కిరోసిన్ పోసి పూజారికి నిప్పంటించారు దుండగులు. ఈ ఘటన సపోత్రాలోని బుక్నా గ్రామంలో జరిగింది. ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆక్రమించడానికి యత్నించగా..
పూజారి ఆసుపత్రిలో ఉండగా ఆయన నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు పోలీసులు. కైలాశ్ మీనా సహా అతని కుమారులు ఆలయ భూమిని ఆక్రమించడానికి యత్నించగా అడ్డుకున్న పూజారిపై నిందితులు దాడికి పాల్పడ్డారని కరౌలీ ఎస్పీ మ్రిదుల్ కచ్వా తెలిపారు. భూమి కంచెకు నిప్పంటించారని వెల్లడించారు.