ETV Bharat / bharat

కరోనాను తరిమికొట్టి.. ఆదర్శంగా నిలిచిన పట్టణం - కరోనానా నియంత్రణ చర్యలు

రాజస్థాన్​ ఝలవాడ్​లోని పిడవా పట్టణంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే అనుక్షణం అప్రమత్తంగా ఉండటం, ప్రజల్లో అవగాహన కల్పించడం, రాజీ లేని జాగ్రత్త చర్యలతో అక్కడ వైరస్​ క్రమంగా కనుమరుగైంది.

pidawa
కరోనాను తరిమికొట్టి.. ఆదర్శంగా నిలిచిన పట్టణం
author img

By

Published : May 31, 2020, 7:45 AM IST

పిడవా... రాజస్థాన్‌లోని ఝలావాడ్‌లో ఓ పట్టణం. ఒకప్పుడు కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా హాట్‌స్పాట్‌గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా దానిని జయించింది. అప్రమత్తత, అవగాహనలతో ఆ వైరస్‌ కోరల నుంచి బయటపడింది.

పకడ్బందీగా జాగ్రత్త చర్యలు

ఏప్రిల్‌ 7న ఝలావాడ్‌లో తొలికేసు నమోదైంది. అదీ పిడవా పట్టణానికి చెందిన వ్యక్తికే. అదేరోజు మరో ఇద్దరు బాధితులనూ అధికారులు గుర్తించారు. వారు ఇండోర్‌, కోటా, బరన్‌ జిల్లాల వారితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిశాక పిడవా పురపాలక సంఘం మొత్తంపై అదేరోజు నుంచి కరోనాను జయించిన పిడవా పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. 40 మంది నుంచి నమూనాలు తీసి పరీక్షలకు పంపిస్తే ఏడుగురికి పాజిటివ్‌ అని వచ్చింది. వీరు ఎవరెవరిని కలిశారో తెలుసుకుని మరో 40 మందికి పరీక్షలు నిర్వహింపజేస్తే వారిలోనూ ముగ్గురు పాజిటివ్‌గా తేలారు. మూడు రోజుల్లోనే కేసులు 13కి చేరిపోయాయి. ఏప్రిల్‌ 17 నాటికి కేసుల సంఖ్య 20కి పెరిగింది. ఆ రోజు తర్వాత ఒక్కకేసూ రాలేదు. అంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. మొట్టమొదటి బాధితుడు సహా అందరూ కోలుకుని ఇళ్లకు చేరుకోగలిగారు.

ఇంటింటి సర్వే ద్వారా..

మొదటి కేసు వెలుగు చూడగానే 42 బృందాల ద్వారా ఇంటింటికీ సర్వే జరిపించి, పర్యవేక్షణ పెంచామనీ, పోలీసుల చేయూతతో కరోనా వ్యాప్తిని తెంచేశామని బ్లాక్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శరద్‌ శర్మ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. అంతా బాగానే ఉన్నా... కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినవారిని చుట్టుపక్కల వారు అస్పృశ్యులుగా చూస్తుండడంతో వారు తిరిగి ఉపాధి పొందడం మాత్రం కష్టమవుతోంది. తమకిప్పుడు కరోనా నెగెటివ్‌ అని నివేదికలు స్పష్టం చేస్తున్నా ఇరుగుపొరుగువారు దగ్గరగా రావడానికే భయపడుతున్నారని వారు ఆవేదనగా చెప్పారు.

ఇదీ చూడండి: డయాబెటిక్​ రోగుల కోసం ప్రత్యేక మామిడి పండ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.