ETV Bharat / bharat

రైతన్నల 'రైల్​ రోకో'.. శుక్రవారం రాష్ట్రబంద్​కు పిలుపు

రాజ్యసభలో ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్​లో చేస్తోన్న ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. రైతన్నల ఆందోళనలు గురువారంతో మూడో రోజుకు చేరాయి. నిరసనల్లో భాగంగా రైల్​రోకో చేపట్టారు రైతులు. అంతేకాకుండా ఈ నెల 25న రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చాయి ఆయా రైతు సంఘాలు.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
పంజాబ్​లో రైతన్నల రైల్​ రోకో
author img

By

Published : Sep 24, 2020, 3:14 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. పంజాబ్​లో రైతులు చేస్తోన్న ఆందోళనలు మూడోరోజుకు చేరాయి. ఈ సందర్భంగా 'రైల్​ రోకో' చేపట్టిన రైతులు.. ఫిరోజ్​పుర్​ రైల్వేస్టేషన్​లో రైల్వేట్రాక్​పై నిరసన తెలిపారు. పలు రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఈ ఆందోళనల వల్ల ఈ నెల 24 నుంచి 26 వరకు 14 జంట రైళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపారు రైల్వే అధికారులు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

రైల్వేట్రాక్​పై ఆందోళన చేస్తోన్న రైతులు

రాష్ట్రబంద్​కు పిలుపు

'రైల్​ రోకో' ఆందోళనకు కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ పిలుపునివ్వగా.. మరికొన్ని రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. వీరికి పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు సహా.. ఇతర విభాగాలు అండగా నిలిచాయి. నిరసనల్లో భాగంగా.. శుక్రవారం (సెప్టెంబర్​ 25) రాష్ట్ర బంద్​​ నిర్వహించాలని 31 రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన రెండు బిల్లులు (ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌) ఈ నెల 20న రాజ్యసభలో ఆమోదం పొందాయి.

ఇదీ చదవండి: 'కొత్త బిల్లులతో రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.