కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమ్ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, భాజపాకు ఆమ్ఆద్మీ పార్టీ తలుపులు తెరిచిందని గుర్తుచేశారు. మోదీని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓడించలేదని... అది కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. తూర్పు దిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ తరఫున రాహుల్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీలు ఇస్తారే తప్ప... వాటిని నెరవేర్చరని ఆరోపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అనే నినాదంతో ఆమ్ఆద్మీ పార్టీ ప్రజల ముందుకెళ్లిందని విమర్శించారు రాహుల్ గాంధీ.
మోదీ భయపడుతున్నారు
ఎన్నికల ఫలితాల గురించి ప్రధాని మోదీ భయపడుతున్నారని ట్వీట్ చేశారు రాహుల్.
-
Dear Mr Modi,
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Your recent statements, interviews & videos are giving India the distinct feeling that you’re cracking under presssure.
You are, however, certainly right to be nervous about the results.
">Dear Mr Modi,
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2019
Your recent statements, interviews & videos are giving India the distinct feeling that you’re cracking under presssure.
You are, however, certainly right to be nervous about the results.Dear Mr Modi,
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2019
Your recent statements, interviews & videos are giving India the distinct feeling that you’re cracking under presssure.
You are, however, certainly right to be nervous about the results.
"ప్రియమైన మోదీ... ఇటీవలి మీ ప్రకటనలు, ఇంటర్వ్యూలు, వీడియోల ద్వారా మీరు ఒత్తిడిలో ఉన్నారనే ఏకైక భావన దేశ ప్రజలకు కలుగుతోంది. అయినా, ఎన్నికల ఫలితాల గురించి మీరు భయపడటం కచ్చితంగా తప్పేంకాదు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు