ETV Bharat / bharat

'వారి జేబుల నుంచే న్యాయ్​ నిధుల సేకరణ'

అసోంలోని బొకాఖత్​ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పాల్గొన్నారు. మోదీ కాపలాకాసిన ధనికుల నుంచే న్యాయ్ పథకానికి కావాల్సిన నిధులు ​సేకరిస్తామన్నారు.

అసోంలోని బొకాఖత్​ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ
author img

By

Published : Apr 3, 2019, 6:17 PM IST

పేదల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తానని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేవలం ధనికులకే ఆ మేలు చేశారని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. ధనికులకు ప్రధాని కాపలాదారుడిగా మారారని విమర్శించారు​.

అసోంలోని బొకాఖత్​లో ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్​. వ్యాపారులు దోచుకున్న డబ్బును సేకరించి కనీస ఆదాయ పథకం ద్వారా పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు.

అసోంలోని బొకాఖత్​ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ

" వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్​ పార్టీ దేశంలో ఉన్న 20 శాతం పేదలకు 3 లక్షల 70 వేల రూపాయలు కచ్చితంగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తుంది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయని మోదీ ప్రశ్నిస్తున్నారు. చౌకీదార్​కు నేను జవాబు చెప్తాను. ఆ ధనం అనిల్​ అంబానీ లాంటి వారి జేబుల్లోంచి వస్తుంది. వాయుసేనకు చెందిన 30 వేల కోట్ల రూపాయలను మీరు(మోదీ) అంబానీకి ఇచ్చారు. వాయుసేన నుంచి డబ్బు దొంగిలించి ఆ దొంగ జేబులో వేశారు. అదే ధనాన్ని ఆ దొంగ నుంచే సేకరించి దేశంలోని పేదలకు అందిస్తాం."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు.

ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో యువత సతమతమవుతోందని... కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడితే తమ సొంత వ్యాపారం పెట్టుకునేందుకు సహాయం అందిస్తామని రాహుల్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పునరుద్ధరిస్తామని, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును అడ్డుకుంటామని హామీ ఇచ్చారు రాహుల్​.

RESTRICTION SUMMARY: NO ACCESS MAINLAND CHINA
SHOTLIST:
CCTV - NO ACCESS MAINLAND CHINA
Shenyang – 3 April 2019
++4:3++
1. Wide of Chinese Navy plane
2. Officials at arrival ceremony
3. Soldiers carrying remains walking out of the plane
4. Close of a soldier carrying a coffin
5. Soldiers marching with coffins
6. Various of people bowing
STORYLINE:
The remains of Chinese soldiers killed in the Korean War were returned to China from South Korea on Wednesday morning, state broadcaster CCTV reported.
Footage from CCTV showed a Chinese Navy plane with the remains of 10 soldiers who died in the Korean War arriving in Shenyang, Liaoning Province in northeastern China.
Around 200 people attended a repatriation ceremony that was held at the airport.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.