అధికారంలోకి వస్తే 5 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి 72 వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నీతి ఆయోగ్ వైస్ - ఛైర్మన్ రాజీవ్ కుమార్. దీని వల్ల ఆర్థిక క్రమశిక్షణ దారి తప్పే ప్రమాదముందని హెచ్చరించారు.
ఓ మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదల్లో 20 శాతం మందిని ఎంపిక చేసి వారికి ఏటా 72 వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు.
"ఎన్నికల్లో గెలవటానికి రాహుల్ గాంధీ సాధ్యం కాని హామీలు ప్రకటిస్తున్నారు. ఇలాంటి పథకాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతుంది. దీనికి బదులు ఉద్యోగ కల్పన చేస్తే బాగుంటుంది "- రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
వాటిలో ఒకటిగా ఈ పథకమూ నిలుస్తుంది...
కనీస ఆదాయ హామీ పథకం అమలుకయ్యే ఖర్చు కోసం దేశ జీడీపీలో 2 శాతం, బడ్జెట్లో 13 శాతం సొమ్మును కేటాయించాలి. దీని వల్ల ప్రజల అవసరాలు తీరవు- రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించటానికి 1971లో 'గరీబీ హఠావో', 2008లో 'ఒకే ర్యాంకు- ఒకే పింఛను', 2013లో 'ఆహార భద్రత' లాంటి పథకాలను ప్రవేశ పెట్టింది. అయితే ఇవి పూర్తిగా అమలు కాక మధ్యలోనే ఆగిపోయాయని, కనీస ఆదాయ పథకం పరిస్థితి ఇదేనని రాజీవ్ విమర్శించారు.
ట్వీట్... డిలీట్...
ప్రధాన మంత్రి ఆర్థిక సలహా సంఘం రాహుల్ గాంధీ ప్రకటనను విమర్శిస్తూ ట్వీట్ చేసింది.
ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం సమతుల్యం చేయడానికి విశేష కృషి చేశాం. కాంగ్రెస్ కనీస ఆదాయ పథకం ఈ సమతుల్యాన్ని చెడగొట్టడం లేదా ప్రభుత్వ ఖర్చులను అధికం చేస్తుందని ఈ రెండూ ప్రమాదకరమని వ్యాఖ్యానించింది.
కనీస ఆదాయ పథకం ఆర్థికంగా విఫలమైన పథకాల్లో ఒకటిగా నిలుస్తుందని సలహా సంఘం ఆరోపించింది. ట్విట్టర్ వినియోగదారుడు ఒకరు సలహా సంఘం ట్వీట్లు ఎన్నికలు నియమావళినిఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే సలహా సంఘం ఈ ట్వీట్లు తొలగించింది.