ETV Bharat / bharat

బిహార్​లో రాహుల్ ప్రచారం ప్రారంభించేది అప్పుడే..

బిహార్​ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 23న ప్రారంభించనున్నారు. మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో మొత్తం 6 సభల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా అదే రోజు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

RAHUL BIHAR
రాహుల్
author img

By

Published : Oct 18, 2020, 5:00 AM IST

బిహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్​ 23 నుంచి పాల్గొననున్నారు. ఆ రోజు రెండు సభల్లో ఆయన మాట్లాడనున్నారు. హిసువాలో కాంగ్రెస్ అభ్యర్థి నీతూ సింగ్ ‌తరఫున రాహుల్ ప్రచారం చేస్తారు.

భూమిహార్ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూమిహార్ సమాజం నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. చాలా కాలం తర్వాత పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావడం ఇదే తొలిసారి.

వరుసగా 9 సార్లు..

భూమిహార్ సామాజికవర్గానికి పార్టీ సందేశాన్ని అందజేసేందుకు వీలుగా కహల్‌గావ్‌లో మరో సభ నిర్వహించనుంది కాంగ్రెస్. సీఎల్‌పీ నాయకుడు సదానంద్ సింగ్ కుమారుడు ముకేశ్ సింగ్ పోటీ చేస్తున్నారు. 9 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా సదానంద్ సింగ్ గెలిచారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ముకేష్ పోటీ చేస్తున్నారు.

ఆర్​జేడీ నేత తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఆ తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. బిహార్ ఎన్నికల్లో ఒక్కో దశలో రెండు ర్యాలీల చొప్పున మొత్తం 6 ర్యాలీల్లో రాహుల్ పాల్గొంటారు.

మోదీ కూడా అదే రోజు..

ప్రధాని నరేంద్రమోదీ కూడా అదే రోజున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మొత్తం మూడు విడతల్లో 12 ఎన్నికల ర్యాలీల్లో మోదీ పాల్గొంటారు. ఈనెల 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది.

ఉపఎన్నికల్లో ప్రచారకర్తలుగా..

మధ్యప్రదేశ్​లో 28 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు ప్రచార కర్తల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ సహా ముఖ్యనేతలు ప్రియాంక గాంధీ, అశోక్ గహ్లోత్​, సచిన్ పైలట్, భూపేశ్ బఘేల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. మొత్తం 28 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో భాజపాకు సాధారణ మెజారిటీ దక్కాలంటే 9 స్థానాల్లో గెలవాలి.

ఇదీ చూడండి: 'గ్రాండ్​ ఛాలెంజెస్​'లో మోదీ ఉపన్యాసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.