వరద బీభత్సానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ ఫోన్లో సంభాషించారు.
బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రధాని హామీ ఇచ్చినట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయకచర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పౌరులకు పిలుపునిచ్చారు.