అవినీతి అంశంపై తనతో చర్చకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి సవాల్ విసిరారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ.
రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పును నమ్మడం లేదా.. అంటూ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రికేయురాలిని మోదీ ప్రశ్నించిన వీడియో క్లిప్‌ను ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
" మోదీ... మీరు పరుగెత్తగలరు. కానీ తప్పించుకోలేరు. దాక్కోలేరు. మీరు చేసిన పనులే మిమ్మల్ని పట్టిస్తాయి. మీ మాటల్లోనే దేశం దాన్ని వింటోంది. నిజం చాలా శక్తిమంతమైనది. నేను మీకో సవాల్ చేస్తున్నా... అవినీతిపై చర్చకు రండి" -- రాహుల్ గాంధీ ట్వీట్
జాతీయ భద్రత, అవినీతి, విదేశాంగ విధానాలపై తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మోదీకి సవాల్ విసిరారు రాహుల్ గాంధీ. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.
అనిల్ అంబానీకి రూ.30వేల కోట్లు దక్కేలా ప్రధాని మోదీ రఫేల్ ఒప్పందంలో అవకతవకలకు పాల్పడ్డారని చాలా కాలంగా ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
ఇవీ చూడండి : 'చౌకీదార్ నాటకాలను ప్రజలు నమ్మరు'