ETV Bharat / bharat

'నేను ముందే చెప్పాను.. అయినా మోదీ వినలేదు' - modi rahul war

దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటిన వేళ మోదీ సర్కార్ ఎక్కడికి వెళ్లిందో కనబడట్లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే ఆగస్టు నెలలో కేసుల సంఖ్య 20 లక్షలు దాటుతుందని తాను ముందే చెప్పినట్లు గుర్తు చేశారు.

rahul-attacks-modi-govt-over-indias-covid-19-tally-crossing-20-lakh-mark
'కేసుల సంఖ్య పెరిగిపోతోంది-మోదీ సర్కార్ కనబడకుండాపోయింది!'
author img

By

Published : Aug 7, 2020, 1:00 PM IST

భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటినా ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న వేళ.. ప్రజల ముందుకు రాకుండా కనబడకుండాపోయిందన్నారు.

'ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండి.. ఇదే స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూపోతే.. ఆగస్ట్ నెలలోగా కేసుల సంఖ్య 20 లక్షలు దాటిపోతుంది' అంటూ జులై 17న తాను చేసిన ట్వీట్​ను రాహుల్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

"కరోనా కేసులు 20 లక్షలు దాటిపోయింది. ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం కనబడటంలేదు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

కరోనా కేసుల్లో అమెరికా , బ్రెజిల్ తర్వాత స్థానంలో ఉంది భారత్. కరోనా బారిన పడి ఇప్పటికే దాదాపు 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: బావిలో పడిన బామ్మను కాపాడిన సాహసవీరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.