బిహార్- రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో సుదీర్ఘకాలంగా ఉన్న బంధాన్ని తెంచుకుని రెండు రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనాతో వారం రోజుల క్రితం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన రఘువంశ్ పరిస్థితి గత అర్ధరాత్రి హఠాత్తుగా క్షీణించింది. దీంతో వెంటనే ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
అక్కడి నుంచే రాజీనామా లేఖ
ఈ నెల 10న ఆసుపత్రి నుంచే తన రాజీనామా లేఖను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు పంపారు రఘువంశ్. లాలూకు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన రఘువంశ్.. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రూపొందించడంలో రఘువంశ్ను కీలకంగా చెబుతుంటారు.
ఇదీ చదవండి: అపార జ్ఞాపకశక్తి.. ఈ చిచ్చరపిడుగు సొంతం