ETV Bharat / bharat

క్వారంటైన్​లో కూలీల శ్రమదానం- బడికి కొత్తరూపం - Quarantined migrant workers paint school in bihar

క్వారంటైన్​ కేంద్రంగా మారిన పాఠశాల భవనాలకు రంగులు అద్ది అందంగా ముస్తాబు చేశారు బిహార్​కు చెందిన వలస కూలీలు. ఇటీవలే నేపాల్​ నుంచి వచ్చిన వీరందరినీ ఇదే స్కూల్​లో క్వారంటైన్​లో ఉంచగా.. ఆ సమయంలోనే అక్కడ చెట్లు కూడా నాటి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు.

Quarantined migrant workers paint walls of Bihar school
క్వారంటైన్​లో ఖాళీగా కూర్చోలేదు.. పాఠశాలకే వన్నె తెచ్చారు
author img

By

Published : May 1, 2020, 3:45 PM IST

Updated : May 1, 2020, 5:07 PM IST

క్వారంటైన్​లో కూలీల శ్రమదానం- బడికి కొత్తరూపం

నేపాల్​ నుంచి బిహార్​లోని తమ స్వగ్రామానికి చేరిన వలస కూలీలు.. క్వారంటైన్​ సమయంలో విద్యర్థులకు ఉపయోగపడే మంచి పనిచేశారు. పశ్చిమ చంపారన్ జిల్లా రాంపుర్వ పంచాయతీలోని లక్ష్మీపుర్​కు చెందిన 52 మంది వలసకూలీలు ఖాళీగా తిని పడుకోకుండా.. ప్రభుత్వ పాఠశాలను అందంగా ముస్తాబు చేశారు. భౌతిక దూరం పాటిస్తూనే.. అక్కడి మైదానాన్ని శుభ్రం చేశారు. అనంతరం పాఠశాల భవనాలకు రంగులు అద్ది.. పరిసరాల్లో పూలు, కూరగాయల చెట్లు నాటి ఆ స్కూల్​కే వన్నె తెచ్చారు.

ప్రధానోపాధ్యాయుడి ఆనందం

వలస కూలీల ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు ప్రధానోపాధ్యాయుడు సంజయ్​ బైతా. వీరందరూ ఖాళీగా కూర్చోకుండా.. కష్టపడి పని చేసేందుకే ప్రాధాన్యమిచ్చారని కొనియాడారు. పెయింటింగ్​తో పాటు పరిసరాలను శుభ్రం చేసేందుకు కావాల్సిన సామగ్రిని కూలీలు అడగ్గా.. అవన్నీ సమకూర్చినట్లు చెప్పారు.

తమ పనిపట్ల ఆనందం వ్యక్తం చేశారు కూలీలు. ఇతర క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారూ ఇలాగే అందరికీ పనికొచ్చే మంచి పనులు చేయాలని సూచించారు.

Last Updated : May 1, 2020, 5:07 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.