ఒడిశాలోని హాతిబరి, మానేస్వర్ స్టేషన్ల మధ్య పూరీ-సూరత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సంబల్పూర్ డివిజన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు.
ప్రమాదం ఇలా..
ఉదయం 7.24 గంటలకు హాతిబరిలో ప్రారంభమైన రైలు.. సంబల్పూర్ డివిజన్ పరిధిలో అర్థరాత్రి 2.04 గంటలకు ఏనుగును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంజన్ ఫ్రంట్ ట్రాలీలో ఆరు చక్రాలు పట్టాలు తప్పాయని సంబల్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని, ఏనుగు మరణించిందని తెలిపారు.
ఇదీ చూడండి : బస్సును ఢీకొన్న రైలు.. 12మంది మృతి