నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లోనే రావణ దహనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మిగిలిన చోట్ల నిరాడంబరంగా పండుగ జరుపుకున్నారు.
పంజాబ్ లూధియానాలో 30 అడుగుల రావణుడి బొమ్మను దగ్ధం చేశారు. దిల్లీలో దసరా వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. శాస్త్రి పార్క్‌లో రావణుడు, కుంభకర్ణ, మేఘనాథుడి బొమ్మలు ఏర్పాటు చేశారు. రాంలీలా మైదానంలో ఏటా రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో రావణ దహనం జరుగుతూ వస్తుంది. ఈ సారి మాత్రం నిర్వాహకులకు పురావస్తు శాఖ అనుమతి ఇవ్వలేదు.
బంగాల్ కోలకతా చెత్లా అగ్రానీలో ఏర్పాటు చేసిన దేవీ విగ్రహాలను భక్తులు దూరం నుంచి దర్శనం చేసుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో దుర్గాపూజలో భక్తులకు ప్రవేశం లేదని కలకత్తా హైకోర్టు ఇంతకముందు స్పష్టంచేసింది.
మైసూర్...
మైసూరులో రాజవంశస్థుల ఆధ్వర్యంలో వందల ఏళ్లుగా నిర్వహిస్తున్న జంబూసవారీని నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు. సోమవారం జరగనున్న జంబూ సవారీకి కేవలం 300 మందికే ఆహ్వానం పంపగా 30 నుంచి 40 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నారు.
- ఇదీ చూడండి: దసరా వేడుకల్లో పూజారిగా మారిన సీఎం