ETV Bharat / bharat

ఆ పెళ్లికి పోలీసులే కన్యాదాతలు!

లాక్​డౌన్ వేళ ఆంక్షలను కచ్చితంగా అమలు చేయడమే కాదు.. ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు పోలీసులు. దేశంలో రాకపోకలు బంద్ అయిన పరిస్థితుల్లో ఆత్మీయ బంధువులుగా మారుతున్నారు. ఖాకీ యూనిఫాం వెనుక వెన్న లాంటి మనసు ఉంటుందని నిరూపిస్తున్నారు. తాజాగా పుణెలోని ఓ వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయడమే కాక.. కన్యాదాతలుగా మారి ఆశ్చర్యపరిచారు.

pune marriage
ఆ పెళ్లికి పోలీసులే కన్యాదాతలు!
author img

By

Published : May 3, 2020, 3:25 PM IST

Updated : May 3, 2020, 3:37 PM IST

పెళ్లి అంటే మరో జీవితానికి ముఖద్వారం వంటిది. జీవితంలోని కీలకమైన ఈ ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. తమ వాళ్ల మధ్య సరదాగా జీవితంలోని ముఖ్యమైన మెట్టును అధిరోహించాలని కోరుకుంటారు. అయితే లాక్​డౌన్ కారణంగా అనేక వివాహాలు వాయిదా పడ్డాయి. మరికొంతమంది ప్రభుత్వ ఆంక్షలను అనుసరించి పరిమితమైన అతిథులతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే పెళ్లికి వధూవరుల బంధువులు హాజరుకాలేకపోయినప్పటికీ చొరవ తీసుకుని వివాహం జరిపించారు పుణె పోలీసులు. కన్యాదానం చేసి పెళ్లి పెద్దలుగా మారారు. అన్ని ఏర్పాట్లు చేసి లాక్​డౌన్​ వేళ ప్రజలకు ఆత్మీయ బంధువులం మేమేనంటూ ఢంకా భజాయించారు.

ఇదీ జరిగింది..

దెహ్రడూన్​కు చెందిన ఆర్మీ మాజీ అధికారి దేవేంద్ర సింగ్ కుమారుడు ఆదిత్యకు.. నాగపుర్​కు చెందిన ఆర్మీ రిటైర్డ్ కల్నల్ కుశ్వాహ కుమార్తె, వైద్యురాలు స్నేహకు ఫిబ్రవరి మొదటివారంలో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి మే 2ను ముహూర్తంగా నిర్ణయించారు.

అయితే లాక్​డౌన్​ కారణంగా కుటుంబసభ్యులు వారి స్వస్థలాల్లో ఉండిపోయారు. వరుడు ఆదిత్య పుణెలో ఉన్నాడు. వధువు స్నేహ.. నాగపుర్ ఎయిమ్స్​లో వైద్యురాలిగా సేవలందిస్తోంది. కుటుంబసభ్యుల వినతి మేరకు పెళ్లి ఏర్పాట్లు చేశారు హదప్​సర్ పోలీసులు. కన్యాదానమూ వారే చేశారు. అలా శనివారం మధ్యాహ్నం నిరాడంబరంగా .. భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ వివాహం జరిగింది.

pune
మాలధారణ..

"ఇన్​స్పెక్టర్​, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు. వివాహానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇన్​స్పెక్టర్​ లోనారీనే చేశారు. పండితుడిని పురమాయించడం, ఫంక్షన్ హాల్ బుకింగ్ వంటివి చేసి పెళ్లి ఏర్పాట్లను సులభతరం చేశారు. డీసీపీ, కమిషనర్ల అనుమతులు తీసుకున్నారు. అన్ని పనులు ఆయనే చేశారు. ఫిబ్రవరిలో మా నిశ్చితార్థం జరిగింది. ప్రధాని మోదీ కరోనా నియంత్రణ కోసం లాక్​డౌన్ పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మే 2న మా వివాహం జరుగుతుందా అనే అనుమానం కలిగింది. కానీ ఇన్​స్పెక్టర్ లొనారీ చొరవతో అంతా చక్కగా జరిగింది. పోలీసులే కన్యాదానం చేశారు."

-వరుడు ఆదిత్య

pune
కుటుంబసభ్యులతో వీడియో కాల్​లో..

'ఆదిత్య తండ్రి నాకు ఫోన్ చేశారు. పెళ్లి జరిగేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని కోరారు. ఈ మేరకు పై అధికారులతో చర్చించాను. వధూవరులిద్దరి తల్లిదండ్రులు ఆర్మీలో రిటైర్డ్ అధికారులు. వరుడి సోదరుడు అంబాలా కూడా ఆర్మీలో కెప్టెన్ స్థాయి అధికారి. వారు ఇక్కడికి రాలేని కారణంగానే.. ఆర్మీ వారికి సహాయపడాలన్న మంచి ఉద్దేశంతో ఈ పని చేశాను' అని చెప్పారు ఇన్​స్పెక్టర్ లోనారీ.

దిల్లీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వందేళ్ల వృద్ధుడి పుట్టినరోజుకు అవసరమైన ఏర్పాట్లు చేసి.. అతిథులుగా హాజరయ్యారు పోలీసులు.

ఇదీ చూడండి: ఉగ్రవాదుల ఏరివేతలో అశుతోష్ 'శౌర్య' ప్రతాపం

Last Updated : May 3, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.