ETV Bharat / bharat

ట్రాన్స్​జెండర్ల కోసం బస్సులో ప్రత్యేక సీట్లు - Transgenders rights

బంగాల్​లోని ప్రైవేటు బస్సుల్లో రెండు సీట్లను ఇకపై ట్రాన్స్​జెండర్ల కోసం రిజర్వ్ చేయనున్నారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాల సంఘం ఈమేరకు తీర్మానం చేసింది.

Private bus operator in Bengal reserves seats for transgenders in buses
ట్రాన్స్​జెండర్ల కోసం బస్సులో ప్రత్యేక సీట్లు!
author img

By

Published : Aug 17, 2020, 3:35 PM IST

బంగాల్​లోని ఓ ప్రైవేటు బస్సుల యాజమాన్యాల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్​జెండర్ల కోసం ప్రత్యేకంగా రెండు సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. ప్రతి బస్సులో హిజ్రాల కోసం 'త్రిధర' పేరుతో రెండు సీట్లు ఉంటాయన్నారు జాయింట్​ కౌన్సిల్​ ఆఫ్​ బస్​ సిండికేట్స్​ ప్రధాన కార్యదర్శి తపన్​ బెనర్జీ​.

"ట్రాన్స్​జెండర్లకు సీట్లు కేటాయించడం మాత్రమే దీని ఉద్దేశం కాదు. వారిని గుర్తించి, వారి పట్ల తోటి ప్రయాణికుల్లో అవగాహన కల్పించడమే ప్రధాన ధ్యేయం."

- తపన్​ బెనర్జీ

రాష్ట్రంలో 35-40 వేల బస్సులు తమ సంఘం పరిధిలో ఉన్నాయని తెలిపారు తపన్​. ఇప్పటికే కోల్​కతాలోని పలు బస్సుల్లో ట్రాన్స్​జెండర్ల కోసం ప్రత్యేక సీట్లను కేటాయించే ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఆరేళ్ల టీచర్ ఆన్​లైన్​ పాఠాలు సూపర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.