కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యా శాఖగా మార్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. దీనిపై నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సచివాలయ వ్యవహార నిబంధన (బిజినెస్ రూల్స్)ల్లో సవరణలు చేశారు.
భారత ప్రభుత్వ (అలకేషన్ ఆఫ్ బిజినెస్) నిబంధనలు-1961లోని మొదటి, రెండు షెడ్యూళ్లలో ఉన్న 'మానవ వనరుల అభివృద్ధి శాఖ' పేరును 'విద్యా శాఖ'గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు.
విద్యా విధానంలో మార్పులు..
నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం.. మంత్రిత్వ శాఖ పేరును కూడా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. జులై 29న జరిగిన కేబినెట్ భేటీలో నూతన విద్యా విధానం ముసాయిదా సిఫార్సుల ప్రకారం ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: 'నూతన విద్యా విధానంపై అనుమానాలు నివృత్తి చేస్తాం'