ETV Bharat / bharat

సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో దాదా లెక్కేవేరు

"పార్టీలో అంతర్గత కలహాలా..? పార్లమెంటులో విపక్షాల నిరసనలా? మిత్ర పక్షాలు గరంగా ఉన్నాయా..? అయితే చర్చలకు దాదాను పంపండి" దశాబ్దాలుగా కాంగ్రెస్​కు ప్రణబ్​ ముఖర్జీ మీద ఉన్న నమ్మకం ఇది. పార్టీలో ఆయన పరిష్కరించని సమస్యే లేదు. అందుకే సంక్షోభం వచ్చిన ప్రతిసారి.. అధిష్ఠానానికి ఆయనో వజ్రాయుధం అయ్యారు.

pranab Mukherjee
ప్రణబ్​ ముఖర్జీ
author img

By

Published : Aug 31, 2020, 6:20 PM IST

పార్టీలోనూ, పార్లమెంట్​ వ్యవహారాల్లోనూ సంక్షోభం తలెత్తినప్పుడల్లా కాంగ్రెస్​ అధిష్ఠానానికి ముందు గుర్తొచ్చేది ప్రణబ్​ ముఖర్జీనే. ఎందుకంటే నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు ఆయన అత్యంత సన్నిహితుడు. పార్టీలో ఎన్ని వివాదాలెదురైనా చాకచక్యంగా పరిష్కరించారు దాదా. ఆయన పరిష్కరించిన సమస్యలు మచ్చుకు కొన్ని....

  1. రాజీవ్​ మరణానంతరం అప్పట్లో కాంగ్రెస్​ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి... చివరి శ్వాస వరకు అ పదవిలోనే కొనసాగాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన్ను తప్పించే బాధ్యత ప్రణబ్​కే అప్పగించారు సోనియా. 1988 మార్చి 14న తన నివాసంలో సీతారాంతో చర్చలు జరిపి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు దాదా.
    Pranab Mukherjee
    మన్మోహన్​ సింగ్​తో ప్రణబ్
  2. శరద్​ పవార్​, పి.ఎ.సంగ్మా, తారిఖ్​ అన్వర్​ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు.. సోనియా విదేశీయత అంశంపై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న సమయంలోనూ ఆమెకు ప్రణబే గుర్తొచ్చారు. వారినెదుర్కొనే బాధ్యత మళ్లీ దాదాకే అప్పగించారు. దీనినీ సమర్థంగా నిర్వర్తించారు ముఖర్జీ.
    Pranab Mukherjee
    సోనియా, రాహుల్​ గాంధీ మధ్య ప్రణబ్
  3. తృణమూల్​ కాంగ్రెస్​, డీఎంకే వంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలతో విభేదాలు తలెత్తినప్పుడూ దాదానే మధ్యవర్తి.
    Pranab Mukherjee
    బాల్​ ఠాక్రేతో ప్రణబ్​
  4. విపక్షాల నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించినప్పుడు ఎన్నో సార్లు రాజీకి వచ్చేలా చేశారు ప్రణబ్​.
    Pranab Mukherjee
    ప్రణబ్​ ముఖర్జీ మంతనాలు
  5. అగ్రరాజ్యం అమెరికాతో అణు ఒప్పంద వ్యవహారంలో అంతర్జాతీయంగా ఎటువంటి ఒడుదొడుకులు రాకుండా అప్పటి అమెరికా అధ్యక్షుడితోనూ మంతనాలు జరిపారు ప్రణబ్​ ముఖర్జీ.
    Pranab Mukherjee
    ప్రణబ్​ ముఖర్జీ
  6. 1991-96 మధ్య ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో సంఘ లక్ష్యాలను పరుగులు పెట్టించారు.
    Pranab Mukherjee
    మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​తో ప్రణబ్​
  7. 1987-89 సంవత్సర మధ్య కాలంలో కాంగ్రెస్​ గడ్డు కాలం ఎదుర్కొంది. ఆ సమయంలో ఏఐసీసీ ఆర్థిక మండలి ఛైర్మన్ పదవి చేపట్టిన ప్రణబ్​... కాంగ్రెస్ ఆర్థిక వ్యవహారాలను ఓ కొలిక్కి తెచ్చి, పార్టీనీ గాడిలో పెట్టారు.
    Pranab Mukherjee
    పీవీ నరసింహారావుతో ప్రణబ్​
  8. 47 సంవత్సరాల వయస్సులోనే దేశంలో క్లిష్టమైన పదవిగా చెప్పుకునే ఆర్థిక మంత్రి పదవి బాధ్యతలు చేపట్టడమే కాకుండా... యూరోమని మ్యాగజైన్​​ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యారు.
    Pranab Mukherjee
    ఆర్థిక మంత్రిగా ప్రణబ్​ ముఖర్జీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.