ETV Bharat / bharat

కరోనా వ్యాప్తికి మన శరీరంలో ఉండే అదే కారణం! - జర్మనీ మందులు

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్​కు విరుగుడు కనిపెట్టే పరిశోధనలో పురోగతి సాధించారు జర్మనీ శాస్త్రవేత్తలు. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోన్న ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించడానికి సహకరిస్తోన్న ప్రోటీన్​ను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం వీలైనంత తొందరగా కోవిడ్​ -19 విరుగుడును ప్రపంచానికి అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

'Potential drug target against coronavirus infection identified'
మానవ శరీరంలోనే కరోనాకు విరుగుడు కనుగొన్న పరిశోధకులు
author img

By

Published : Mar 6, 2020, 4:19 PM IST

ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్‌-19)కు మందు కనిపెట్టే పరిశోధనలో పురోగతి సాధించినట్లు తెలిపారు జర్మన్​ శాస్త్రవేత్తలు. మానవ ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్‌ ప్రవేశించడానికి సహాయపడుతున్న ప్రోటీన్‌ను గుర్తించారు పరిశోధకులు. ఈ మేరకు జర్మనీకి చెందిన ‘జర్మన్‌ ప్రైమేట్‌ సెంటర్‌ సహా మరికొంత మంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలను ‘జర్నల్‌ సెల్‌లో ప్రచురించారు.

" ఊపిరితిత్తుల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించడానికి దోహదపడుతున్న సెల్యులార్‌ ప్రోటీన్‌ను కనుగొన్నాం. మనిషి శరీరంలో ఉండే టీఎమ్‌పీఆర్‌ఎస్‌ఎస్‌-2 అనే ప్రోటీన్​ దీనికి సహకరిస్తోంది. దీని సాయంతోనే కరోనాకు మందు కనుగొనే అవకాశం ఉంది."

--- స్టీఫెన్‌ పోల్‌మన్‌, జర్మన్‌ ప్రైమేట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త

క్లోమ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగిస్తున్న 'కామోస్టాట్‌ మెసిలేట్‌' అనే డ్రగ్‌ను టీఎమ్‌పీఆర్‌ఎస్‌ఎస్‌-2 నిరోధించేందుకు ఇప్పటికే ఉపయోగిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. ఈ డ్రగ్‌ను జపాన్‌ ప్రభుత్వం కూడా గుర్తించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఐసోలేట్‌ చేసిన ఓ వ్యక్తిపై ప్రయోగాలు జరపగా మెరుగైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. మరిన్ని ప్రయోగాలు జరిపి దీన్ని ధ్రువీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కొవిడ్​-19 ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులకు దారి తీస్తోంది. ఇప్పటికే దీని కారణంగా 3000 మందికి పైగా మృతి చెందారు. దాదాపు లక్ష మందికి పైగా ఈ వైరస్​ సోకింది.

ఇదీ చదవండి: ట్రాఫిక్​ ఉల్లంఘనలతో బస్సు యజమానికి రూ.6.7 లక్షల ఫైన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.