బిహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లాలో 263.5 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన నెలతిరగక ముందే వరదలకు కొట్టుకుపోయింది. తూర్పు చంపారన్‌ను గోపాల్‌గంజ్‌ను కలుపుతూ 8 ఏళ్ల వ్యవధిలో గందక్ నదిపై సత్తర్‌ఘాట్ పేరిట వంతెనను నిర్మించారు. గత నెల 16న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రారంభించారు.
అయితే నెల తిరగక మునుపే.. బుధవారం నాడు ఆ వంతెనలో కొంత భాగం వరదకు కొట్టుకుపోయింది. దీనిపై విపక్షాలు నితీశ్ సర్కారును లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.