ETV Bharat / bharat

సార్వత్రిక ఐదో దశలో 63.56 % పోలింగ్ - లోక్​సభ ఎన్నికలు

సార్వత్రిక సమరం ఐదో విడత పోలింగ్​లో 63.56 శాతం ఓటింగ్​ నమోదైంది. కశ్మీర్​, బంగాల్​లో కొన్ని ఘర్షణలు మినహా ఓటింగ్ సజావుగా సాగింది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

సార్వత్రిక సమరం ఐదో దశ సమాప్తం
author img

By

Published : May 6, 2019, 5:01 PM IST

Updated : May 7, 2019, 2:23 AM IST

సార్వత్రిక సమరం ఐదో దశ సమాప్తం

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజవర్గాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 63.56 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.

ఈ విడతలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు పోటీలో నిలుచున్నారు.

రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం...

బంగాల్​ - 74.42 శాతం

ఝార్ఖండ్​ - 63.72 శాతం

మధ్యప్రదేశ్​ - 63.88 శాతం

ఉత్తరప్రదేశ్​ - 57.33 శాతం

బిహార్​ - 57.86 శాతం

రాజస్థాన్​ - 63.78 శాతం

అనంత్​నాగ్​ - 8.76 శాతం

లద్దాఖ్​ - ​71.10 శాతం

కశ్మీర్​లో గ్రెనేడ్​ పేలుడు

జమ్ముకశ్మీర్​లో ఓటింగ్​ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ పోలింగ్ కేంద్రంపై గ్రెనేడ్​ దాడి జరిగింది. పుల్వామా జిల్లాలోని రోహ్మోలో ఓటర్లను భయభ్రాంతులను గురిచేసేందుకే ఉగ్రవాదులు దాడి జరిపి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
ఆందోళనలు నెలకొన్నా.. పటిష్ఠ భద్రత మధ్య పోలింగ్​ ప్రశాంతంగా సాగింది.

బంగాల్​​లో అదే తీరు..

బంగాల్​లోని కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో సాంకేతిక సమస్య కారణంగా ఓటింగ్​ ఆలస్యంగా ప్రారంభమైంది.
బరాక్​పుర్​లో భాజపా అభ్యర్థి అర్జున్​ సింగ్, కేంద్ర బలగాలకు మధ్య వాగ్వాదం జరిగింది. తృణమూల్​ నేతలు రిగ్గింగ్​కు పాల్పడ్డారని, మళ్లీ పోలింగ్​ జరిపించాలని డిమాండ్ చేశారు భాజపా నాయకులు.

హుగ్లీలోని బెల్మూరి బూత్​లో పోలింగ్​ అధికారిని ఓ భాజపా అభ్యర్థి బెదిరించారు. తారక్​స్వర్​ పోలింగ్​ కేంద్రంలో అందరి ఓట్లను టీఎంసీ నేత ఒక్కరే వేస్తున్నారన్న ఆరోపణలతో ప్రిసైడింగ్ అధికారిని తొలగించారు.

బిహార్​లో ఈవీఎం ధ్వంసం

బిహార్​ ఛప్రాలోని 131వ నెంబరు కేంద్రంలో ఓ వ్యక్తి ఈవీఎంను ధ్వంసం చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓటింగ్​లో ప్రముఖులు

ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల ముందు బారులుదీరారు ఓటర్లు. పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు రాజ్​నాథ్​ సింగ్, రాజ్యవర్ధన్​ సింగ్​ రాఠోడ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్​ సిన్హా, ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యారు.

మే 12, 19న ఆరు, ఏడు దశల పోలింగ్​ జరగనుంది. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడనుంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 7, 2019, 2:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.