ETV Bharat / bharat

'ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే మోదీ నిద్రపోతున్నారు' - congress latest news

కరోనా వైరస్​ నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోందనడానికి స్టాక్ మార్కెట్లు కుప్పకులడమే నిదర్శనమన్నారు. కరోనాపై మోదీ జాగ్రత్త చెబుతున్నారు కానీ.. వైరస్​ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిచడం లేదని విమర్శించారు రాహుల్​.

rahul news
'ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే మోదీ నిద్రపోతున్నారు'
author img

By

Published : Mar 12, 2020, 8:02 PM IST

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇప్పటికే ఆలస్యం చేసిందని, ఇప్పుడు ఇక అత్యవసరంగా స్పందించాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్ధపై కరోనా ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుందని రాహుల్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్ధ కుప్పకూలుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ నిద్రపోతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరోనా నివారణపై తీసుకుంటున్న చర్యలను కేంద్రం.. ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆర్థిక వ్యవస్థపై...

ఆర్థిక వ్యవస్ధను మోదీ సర్కార్‌ ధ్వంసం చేసిందని ఆరోపించారు రాహుల్. ఎస్బీఐ డబ్బులను నష్టాల్లో ఉన్న యెస్‌ బ్యాంకులో పెట్టుబడి పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. మోదీ కేవలం తనకు సన్నిహితులైన 10-15 మంది పారిశ్రామికవేత్తలకు మేలును చేస్తున్నారని విమర్శించారు.

మీడియాతో మాట్లాడుతున్న రాహుల్​

"స్టాక్ మార్కెట్లు ఎలా కుప్పకూలాయో మీరు గమనిస్తునే ఉన్నారు. ఈ పరిణామాలు ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తున్నాయి. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమని నేను కొద్ది రోజులుగా చెబుతునే ఉన్నా. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దేశానికి ఆర్థిక వ్యవస్థే బలం. మోదీ ప్రభుత్వ విధానాలతో దానిని నాశనం చేశారు. ఈ విషయంపై మోదీ ఏమీ మాట్లడరు. అసలు ఆర్థిక వ్యవస్థ అంశాన్నే ప్రస్తావించరు. నిర్మలా సీతారామన్​కు అసలు ఏమీ తెలియదు. ఆర్థిక వ్యవస్థ బలపేతం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో మోదీ ప్రజలుకు చెప్పాలి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది. కారణమేంటి అనేది వివరించాలి."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.

సింధియా సిద్ధాంతాలు విస్మరించారు..

కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాపై విమర్శలు గుప్పించారు రాహుల్‌. ఆయన తన సిద్ధాంతాలను జేబులో దాచి ఆర్​ఎస్​ఎస్​ గూటికి చేరారని అన్నారు. సింధియాకు భాజపాలో తగిన గౌరవం దక్కదని, ఆయనకు అక్కడ అసంతృప్తే మిగులుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: కరోనాపై ప్రజలకు మోదీ సందేశం ఇదే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.