కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. పరిస్థితిపై కేంద్రం అప్రమత్తంగా ఉందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఎలాంటి ఆందోళకు గురికావద్దని.. తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.
"ఎలాంటి భయం వద్దు. జాగ్రత్తలు పాటించండి. కొద్ది రోజుల పాటు కేంద్ర మంత్రులు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరు. మీరు కూడా అవసరమైతే తప్ప ప్రయాణం చేయకండి. గుమిగూడకుండా ఉంటే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు "
-ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్.
భారత్లో కరోనా కేసుల సంఖ్య 73కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.