ETV Bharat / bharat

ట్విట్టర్​లో మోదీ త్రీడీ యోగా క్లాసులు - ప్రధాని యోగా ఆసనాలను ఎలా చేస్తారో తెలుసా?

ప్రధాని నరేంద్రమోదీ 3డీ- యానిమేటెడ్​ యోగా వీడియోలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. నిన్న జరిగిన మనసులో మాట (మన్​ కీ బాత్​) కార్యక్రమంలో మీరు ఏవిధంగా ఫిట్​గా ఉంటారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియోలను పోస్ట్​ చేసినట్లు తెలిపారు.

PM shares 3D animated videos of him practising yoga
ప్రధాని యోగా ఆసనాలను ఎలా చేస్తారో తెలుసా?
author img

By

Published : Mar 30, 2020, 12:01 PM IST

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తను ఏ విధంగా ఫిట్​గా ఉం

టారో తెలియజేయటం కోసం ట్విట్టర్​లో త్రీడీ- యానిమేటెడ్​ యోగా వీడియోలను పోస్ట్​ చేశారు.

"నిన్న జరిగిన మన్ ​కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా నా ఫిట్​నెస్​ గురించి ఓ వ్యక్తి నన్ను అడిగారు. అందుకే నేను నా యోగా వీడియోలను పంచుకోవాలని అనుకుంటున్నాను. వీటిని చూసి మీరు కూడా రోజు యోగా ప్రారంభిస్తారని నమ్ముతున్నాను."

-నరేంద్రమోదీ, ప్రధాని.

ఆదివారం మనసులో మాట కార్యక్రమంలో "మీరు ఎలా ఇంత ఫిట్​గా ఉంటారు" అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'యోగా విత్ మోదీ' వీడియోలను షేర్​ చేసినట్లు తెలిపారు ప్రధాని

"కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను ఫిట్​నెస్​ నిపుణుడిని కాదు. యోగా గురువును అసలే కాదు. నేను యోగా అభ్యాసకుడిని మాత్రమే. కొన్ని యోగాసనాలు వల్ల నాకు చాలా ప్రయోజనం కలిగింది. ప్రస్తుత లాక్​డౌన్​ పరిస్థితుల్లో ఈ యోగా మీకు కూడా ప్రయోజనాలను చేకూర్చవచ్చు." అని ట్వీట్​ చేశారు మోదీ.

ఇదీ చూడండి:తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.