నేడు జరగనున్న ఇండియా ఐడియాస్ సమిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్-అమెరికా వాణిజ్య మండలి నిర్వహిస్తున్న ఈ సదస్సులో మోదీ పలు కీలక విషయాలను ప్రస్తావించే అవకాశముంది.
ఈ మండలిని స్థాపించి ఈ ఏడాదికి 45ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి.. 'మెరుగైన భవిష్యత్తు నిర్మాణం' అనే అంశాన్ని థీమ్‌గా ఎంపిక చేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
వర్చువల్ విధానంలో జరగనున్న ఈ భేటీలో భారత్-అమెరికా విదేశాంగమంత్రులు జైశంకర్, మైక్ పాంపియోతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు, వాణిజ్య-సామాజిక నేతలు పాల్గొననున్నారు.
సదస్సులో భాగంగా భారత్-అమెరికా సహకారం సహా కరోనా సంక్షోభం అనంతరం ఇరు దేశాల భవిష్యత్తు సంబంధాలపై అధికారులు చర్చించనున్నారు.
ఇదీ చూడండి:- 'భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం'