ETV Bharat / bharat

జీ-20 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ - జీ-20 సదస్సు

సౌదీ రాజు ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ.. శనివారం ప్రారంభంకానున్న జీ-20 సదస్సులో పాల్గొననున్నారు. వర్చువల్​ విధానంలో జరగనున్న ఈ సదస్సులో కరోనా రికవరీపై నేతలు చర్చించనున్నారు.

PM Modi to attend 15th G-20 summit
జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరు
author img

By

Published : Nov 21, 2020, 5:03 AM IST

రెండు రోజుల పాటు జరగనున్న 15వ జీ-20 సదస్సు శనివారం ప్రారంభంకానుంది. సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా శనివారం ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

"రియలైజింగ్​ ది ఆపర్చ్యూనిటీస్​ ఆఫ్​ 21స్ట్​​ సెంచ్యూరీ ఫర్​ ఆల్​" అనేది ఈసారి థీమ్​గా ఎంచుకున్నట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

"సౌదీ రాజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జీ-20 సదస్సులో పాల్గొంటారు. కొవిడ్​-19 రికవరీ సమయంలో ప్రదర్శించాల్సిన ఐకమత్యం, ధైర్యంపై ఈ సదస్సులో నేతలు దృష్టి పెడతారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి తమ ప్రణాళికలను నేతలు చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంపై వీరు సమాలోచనలు చేస్తారు."

--- భారత విదేశాంగశాఖ.

ఈ ఏడాది ఇప్పటికే ఓసారి జీ-20 సదస్సును నిర్వహించారు. మార్చి నెలలో జరిగిన ఆ భేటీలో.. కరోనా వ్యాప్తిపై నేతలు చర్చించారు.

ఇదీ చూడండి:- కరోనా టీకా పురోగతి, పంపిణీపై మోదీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.