ETV Bharat / bharat

రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులను సమీక్షించిన మోదీ - pragati meeting modi

34వ ప్రగతి సమావేశంలో భాగంగా రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు సూచించారు.

PM Modi reviews projects worth over Rs 1 lakh crore in 'Pragati' meeting
రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులను సమీక్షించిన మోదీ
author img

By

Published : Dec 30, 2020, 9:33 PM IST

దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. 34వ ప్రగతి సమావేశంలో భాగంగా ఆయన వీటిపై చర్చించారు.

రైల్వే, రోడ్డు రవాణా, రహదారులు, గృహ, పట్టణ వ్యవహరాల శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా మోదీ సమీక్షించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. యూపీ, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, జమ్ముకశ్మీర్​, బంగాల్​, మహారాష్ట్ర, దిల్లీ, హరియాణా, గుజరాత్, దాద్రా నగర్ హవేలీలో ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొంది.

ఈ సమావేశంలో భాగంగా ఆయుష్మాన్​ భారత్​, జల్ జీవన్​ మిషన్​ కార్యక్రమాలపైనా అధికారులతో మోదీ చర్చించారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు సూచించారు.

ఇప్పటి వరకు 33 ప్రగతి సమావేశాల్లో 280 ప్రాజెక్టులు, 50 కార్యక్రమాలు, వివిధ పథకాలు, 18 రంగాలకు చెందిన ఫిర్యాదులను సమీక్షించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.