నీతీఆయోగ్ను పునరుద్ధరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని ఛైర్మన్‌గా ఉండే ఈ నీతీ ఆయోగ్‌లో ఉపాధ్యక్షుడుగా రాజీవ్‌కుమార్ సేవలందిస్తారు. హోంమంత్రి అమిత్‌షా ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ఉంటారు.
అమిత్‌షాతోపాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.
నీతీ ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితులుగా రవాణామంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వేమంత్రి పీయూష్ గోయెల్, సామాజిక న్యాయమంత్రి థావర్‌చంద్ గెహ్లోత్, గణాంక శాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ నియమితులయ్యారు.
ప్రస్తుత నీతీఆయోగ్ ప్యానెల్ సభ్యులుగా ఉన్న వీకే సారస్వత్, రమేష్‌చంద్, వీకే పాల్.. తమ బాధ్యతల్లో కొనసాగనున్నారు. మరో సభ్యుడు వివేక్ దేబ్రోయ్‌ను తొలగిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: బ్రిడ్జ్ మ్యాన్: పింఛన్ డబ్బుతో నదిపై వంతెన