ప్రచండ తుపాను 'అంపన్' బీభత్సానికి చిగురుటాకులా వణికిన బంగాల్లో పరిస్థితుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు ప్రకటించారు.
బంగాల్ పునర్నిర్మాణంలో మమతతో కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. నష్టపోయిన ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసానిచ్చారు. తూపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
-
#WATCH: PM Narendra Modi conducts aerial survey of areas affected by #CycloneAmphan in West Bengal. CM Mamata Banerjee is also accompanying. pic.twitter.com/Da7NebJhws
— ANI (@ANI) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: PM Narendra Modi conducts aerial survey of areas affected by #CycloneAmphan in West Bengal. CM Mamata Banerjee is also accompanying. pic.twitter.com/Da7NebJhws
— ANI (@ANI) May 22, 2020#WATCH: PM Narendra Modi conducts aerial survey of areas affected by #CycloneAmphan in West Bengal. CM Mamata Banerjee is also accompanying. pic.twitter.com/Da7NebJhws
— ANI (@ANI) May 22, 2020
మమత లెక్కలివే...
అంపన్ దెబ్బకు రాష్ట్రంలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొన్నారు బంగాల్ సీఎం మమతా. విపత్తు ఫలితంగా రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.
తుపాను కారణంగా ఇప్పటివరకు 80 మంది చనిపోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారని.. భారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, మిధనాపుర్, కోల్కతా, హావ్డా, హూజ్లే జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందని మమత వెల్లడించారు.