భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా వ్యాప్తి నుంచి భారతీయులను కాపాడడంలోఎయిర్ ఇండియా సిబ్బంది సేవలు అమోఘమని ట్వీట్ చేశారు.
రోమ్‌లో చిక్కుకున్న 263 మంది భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చిన ఏఐ బోయింగ్ 777 విమాన సిబ్బంది ఫొటోను పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఎంతో ధైర్యం ప్రదర్శించి, మానవత్వాన్ని చాటిన ఎయిర్ ఇండియా బృందాన్ని చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. వారి కృషిని యావత్ భారత పౌరులు ప్రశంసిస్తున్నారు."
-ప్రధాని మోదీ ట్వీట్
తమ సిబ్బందిని అనేక మంది దూరం పెడుతున్నారని, వివక్ష చూపుతున్నారని ఆ సంస్థ నిన్న ప్రకటించింది. మరుసటి రోజే వారిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని .